Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచం మారాలి.. సమాజం మారాలి.. వారంతా బద్ధశత్రువులే : పవన్ కళ్యాణ్

ప్రపంచం మారాలి.. సమాజం మారాలి.. వారంతా బద్ధశత్రువులే : పవన్ కళ్యాణ్
, శనివారం, 9 అక్టోబరు 2021 (17:25 IST)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాట స్ఫూర్తే జనసేన పార్టీని స్థాపించేలా చేసిందని, ఉద్యమ విద్యుత్‌ను తనలో ప్రవహింపజేసిందని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచం మారాలి, సమాజం మారాలని కోరుకుంటామని, కానీ ఎందులోనైనా అడుగుపెడితే తప్ప అనుభవం రాదన్నారు. 
 
జనసేన పార్టీ తెలంగాణ విభాగం క్రియాశీలక కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ స్ఫూర్తి తన గుండెల్లో ధైర్యాన్ని నింపిందని అన్నారు. 
 
'గెలుస్తామో, ఓడిపోతామో నాకు తెలియదు. నేను రాజకీయాల్లోకి వస్తుంటే భయపెట్టారు. మార్పు కోసం, బలమైన సామాజిక చైతన్యం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. డబ్బులతో కొనలేని కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తేవాలన్నది నా ఆశయం. రాజకీయాల్లో నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. అయితే అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను' అని అన్నారు. 
 
'కులం, మతం, రంగు, ప్రాంతం మనకు తెలియకుండా జరిగిపోయే అంశాలు. రాజకీయాల్లో వాటి ప్రస్తావన ఉండకూడదు. కులాలను రెచ్చగొట్టాలని ఏనాడూ ప్రయత్నించలేదు. ఏపీలో అభివృద్ధి దిగజారిపోయింది. అభివృద్ధి నిరోధకులు ఎవరైనా సరే నాకు బద్ధ శత్రువులే' అని పవన్ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూసీ నదిలో మొసలి... హడలిపోతున్న స్థానికులు