Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ప్రభావం ధోనీ కెరీర్‌పై పడుతుందా? ఐపీఎల్‌ జరగకపోతే ధోనీ పరిస్థితి ఏంటి?

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (18:21 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్ ప్రభావంతో ఐపీఎల్ ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది. రోనా తీవ్రత తగ్గకపోతే అసలు ఐపీఎల్ జరుగుతుందో లేదోనని కూడా అనుమానాలు మొదలవుతున్న నేపథ్యంలో.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్‌పై కరోనా వైరస్ ఎఫెక్ట్ పడింది. 
 
ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్‌ ఓటమి అనంతరం ధోనీ క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అతడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ 13వ సీజన్‌ మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, భారత్‌లో కరోనా విజృంభిస్తుండటంతో ఏప్రిల్‌ 15కు వాయిదా వేశారు.
 
కాగా ఐపీఎల్‌లో సత్తాచాటితేనే ధోనీ ట్వంటీ-20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో స్థానం సంపాదించుకుంటాడని ప్రధాన కోచ్ రవిశాస్త్రి గతంలో చెప్పిన నేపథ్యంలో.. కరోనా కారణంగా ఐపీఎల్‌ జరగకపోతే ధోనీ పరిస్థితి ఏంటి? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ధోనీని ఈ ఏడాది ఆసీస్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలంటే.. ఐపీఎల్‌లో ధోనీ సత్తా చాటాల్సిన పరిస్థితి. కానీ ఐపీఎల్ జరగకపోతే.. ఆయన్ని జట్టులోకి తీసుకుంటారా లేదా అనేది అనుమానమే. 
 
కానీ ధోనీ పునరాగమనానికి ఐపీఎల్ వారధి కాదని క్రీడా పండితులు అంటున్నారు. ధోనీకి రావాలని వుండి.. సెలక్టర్లకు అందుబాటులోకి వస్తే.. అతడిని ఎవ్వరూ ఆపలేరని చెప్తున్నారు. ఎందుకంటే అతడికి అపారమైన అనుభవం వుంది. టీ20 ప్రపంచకప్‌లో అతడి అనుభవం కావాలనుకుంటే.. ఐపీఎల్‌ ఆడినా, ఆడకపోయినా అతడు జట్టులోకి వస్తాడని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments