గర్భస్థ శిశువుకు కరోనా వైరస్ సోకే ప్రమాదం వుండదని తేలింది. చైనా అధ్యయనంలో ఈ విషయం వెల్లడి అయ్యింది. కరోనా పుట్టిన వూహాన్‌లో నగరంలో నలుగురు గర్భవతులపై జరిగిన పరిశోధనలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారి తల్లి గర్భంలోని శిశువులకు సోకదని చైనా యూనివర్శిటీ స్పష్టం చేసింది.
ఒకవేళ తల్లికి కరోనా వైరస్ వున్నప్పటికీ.. బిడ్డకు అది సోకదని తేలింది. దీంతో నవజాత శిశువులకు ఈ వైరస్ సోకదని హౌఝాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
వూహాన్‌లో నలుగురు నెలలు నిండిన గర్భవతులపై ఈ అధ్యయనం జరిగింది. అలాగే పుట్టిన ముగ్గురు శిశువులకు సాధారణ ఆహారమే అందించినా.. ఎవరిలోనూ కరోనా లక్షణాలు లేవని తేలినట్లు పరిశోధకులు తేల్చారు.