Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇటలీకి హనీమూన్‌.. కొత్త దంపతులకు కరోనా.. దాచిన తండ్రిపై కేసు

ఇటలీకి హనీమూన్‌.. కొత్త దంపతులకు కరోనా.. దాచిన తండ్రిపై కేసు
, మంగళవారం, 17 మార్చి 2020 (17:14 IST)
కరోనా భయంతో జనం జడుసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కరోనాకు ముందస్తు జాగ్రత్తలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ జనం ఎక్కువగా గుమికూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఇంకా షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద ఈవెంట్లను కూడా రద్దు అవుతున్నాయి. ప్రజలను కరోనా వైరస్ నుంచి రక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు చేస్తున్నాయి. 
 
కానీ కరోనా వుంటే ముందస్తుగా సమాచారం ఇవ్వండని ఎంత చెప్తున్నా.. కొందరు మాత్రం కరోనా వుందనే విషయాన్ని దాచేస్తున్నారు. ఇలా కరోనా బారినపడిన ఓ కొత్త జంటను ఆగ్రాలో కనుగొన్నారు.. వైద్య అధికారులు. 
 
వివరాల్లోకి వెళితే.. కరోనా బారినపడిన తన కుమార్తెను ఇంట్లో దాచిపెట్టి అధికారులను తప్పుదోవ పట్టించాడు ఓ తండ్రి. ఇటలీకి హనీమూన్‌కు వెళ్లిన తన కుమార్తె వివరాలను దాచిపెట్టి వైద్య అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చాడు. చివరకు అల్లుడితో పాటు కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
 
ఆగ్రాలోని కంటోన్మెంట్ రైల్వే కాలనీలో నివాసం ఉండే ఓ మహిళ తన భర్తతో కలిసి ఇటీవల హనీమూన్‌ కోసం ఇటలీకి వెళ్లొచ్చింది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తకు పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో అతడి ట్రావెల్ హిస్టరీని ట్రాక్ చేసిన కర్ణాటక వైద్యాధికారులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. 
 
ఆగ్రాలో తల్లిదండ్రుల వద్ద ఉన్న ఆ వ్యక్తి భార్యను పరీక్షించేందుకు వైద్యుల బృందం వారి ఇంటికి వెళ్లగా.. ఆమె తండ్రి అధికారులను తప్పుదోవ పట్టించాడు. తన కుమార్తె ఇంట్లో లేదని, ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వెళ్తోందని చెప్పాడు. 
 
కానీ, ఆమె ఆ ఇంట్లోనే ఉందనే విషయాన్ని అధికారులు గుర్తించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా.. అధికారులను తప్పుదోవ పట్టించింనందుకు పోలీసులు.. యువతి తండ్రిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా-ఫ్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.50కి పెంపు.. దుప్పట్లు ఇచ్చేది లేదు..