సొంత గడ్డపై కేక.. ముంబైని ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్

Webdunia
శనివారం, 6 మే 2023 (22:17 IST)
Mumbai Indians_CSK
ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపును నమోదు చేసుకుంది. ముంబై ఇండియన్స్‌పై ఆరు వికెట్ల తేడాతో చెన్నై గెలవడంతో పాయింట్ల పట్టికలో ధోనీ సేన రెండో స్థానానికి చేరుకుంది. ఆద్యంతం ధోనీ సేన ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకుంటుంది. 
 
చేపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పసుపు జట్టు ముంబైకి చుక్కలు చూపించింది. తొలుత ముంబయిని 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులతో కట్టడి చేసిన చెన్నై, అనంతరం 140 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 17.4 ఓవర్లలో సునాయాసంగా ఛేదించింది. 
 
చెన్నై ఆటగాళ్లలో డెవాన్ కాన్వే 44, రుతురాజ్ 30 పరుగులు, రహానే 21 పరుగులు సాధించారు. అంబటి రాయుడు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. దూబే 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 
 
ముంబయి ఇండియన్స్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా 2, ట్రిస్టాన్ స్టబ్స్ 1, ఆకాశ్ మధ్వాల్ 1 వికెట్ తీశారు. ఇక సీఎస్‌కే చేతిలో కెప్టెన్‌ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఓడింది. 13 సంవత్సరాల తర్వాత చేపాక్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించిన రికార్డును చెన్నై తన ఖాతాలో వేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వర్షాలు.. తీవ్రమైన చలి

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

తర్వాతి కథనం
Show comments