రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్‌కు అతని మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించబడింది.
సోమవారం జరిగిన మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్-ఉల్-హక్ మధ్య మాటల వాగ్వివాదం జరిగింది. దీంతో వారికి జరిమానా విధించడం జరిగింది.
అలాగే కోహ్లీ ఫీజులోనూ వంద శాతం కోత పడింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీన్-ఉల్-హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు.