Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీకి షాక్.. సుందర్ అవుట్.. ఆకాష్ దీప్‌కు ఛాన్స్

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (14:09 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో 2021లో విరాట్ కోహ్లీకి షాకుల మీద షాక్‌లు తప్పట్లేదు. కారణం.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్… చేతి వేలి గాయం కారణంగా.. ఐపీఎల్ 2021 రెండోదశ మ్యాచ్‌లకు పూర్తిగా దూరమయ్యాడు. 
 
ఆర్సీబీ కీలక ఆటగాళ్లలో ఒకడైన సుందర్ సీజన్ మొత్తానికి దూరం కావడంతో ఆ జట్టు పై ప్రభావం పడుతుంది. సుందర్ స్థానంలో బెంగాల్ బౌలర్ ఆకాష్ దీప్‌కు ఛాన్స్ ఇచ్చింది.
 
ప్రస్తుతం ఆకాష్ దీప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్యాంప్‌లో నెట్ బౌలర్‌గా ఉన్నాడు. ఇక అంతకు ముందు సుందర్ ఇదే చేతి వేలి గాయం కారణంగా ఇంగ్లాండ్ పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలగిన సంగతి విదితమే. 
 
కాగా యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 రెండోదశ మ్యాచులు సెప్టెంబర్ 19 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఇప్పటికే కొన్ని జట్లు దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్ మ్యాచ్‌లో నిమగ్నమై ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 19న మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆమెతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటా..: రన్యారావు భర్త జతిన్

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments