Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీఎంఐ టెలిపోర్ట్‌ క్విజ్‌; ఐదుగురు అదృష్టవంతులకు ఐపీఎల్‌ 2021 ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం

Advertiesment
పీఎంఐ టెలిపోర్ట్‌ క్విజ్‌; ఐదుగురు అదృష్టవంతులకు ఐపీఎల్‌ 2021 ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం
, మంగళవారం, 24 ఆగస్టు 2021 (23:12 IST)
పరిమ్యాచ్‌ బ్రాండ్‌ కోసం విస్తరణ వ్యూహ అమలు, అభివృద్ధిలో నిమగ్నమైన సేవా సంస్ధ పీఎంఐ, ఇప్పుడు టెలిపోర్ట్‌ క్విజ్‌ ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ క్విజ్‌ పోటీలో విజేతలుగా నిలిచిన ఐదుగురు అదృష్టవంతులకు యుఏఈలో త్వరలో జరుగనున్న ఐపీఎల్‌ ద్వితీయార్ధపు పోటీలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం లభిస్తుంది. ఈ క్విజ్‌ విజేతలకు అతి పెద్ద లీగ్‌ అభిమానులుగా టైటిల్‌ మాత్రమే లభించడం కాదు, ఐపీఎల్‌ 2021ను స్టేడియంలో ప్రత్యక్షంగా ఇతర ప్రేక్షకుల నడుమ చూసి ఆనందించే అవకాశం కూడా లభిస్తుంది.
 
పరిమ్యాచ్‌ పోర్టల్‌పై ఈ క్రీడను భారతీయ ప్రేక్షకులు అమితంగా అభిమానిస్తుంటారు. వాస్తవ జీవితంలో కూడా ఈ క్రీడ పట్ల అమితాసక్తిని చూపుతుంటారు. వారి ఆసక్తి, ఉత్సాహం, స్ఫూర్తిని ఈ బ్రాండ్‌ ప్రదర్శిస్తుంది. ఈ కారణం చేతనే ఈ కంపెనీ, టెలిపోర్ట్‌ పోటీని పరిచయం చేస్తుంది. భారతీయ క్రీడాభిమానులకు అపూర్వమైన అవకాశాన్నీ అందిస్తుంది. అదృష్టవంతులైన అభిమానులు ఎమిరేట్స్‌ వెళ్లే అవకాశం మాత్రమే కాదు, అతి పెద్దగేమ్‌ను ప్రేక్షకుల నడుమ కూర్చుని చూసే అవకాశమూ పొందగలరు.
 
పీఎంఐ- సీఎంఓ దిమిత్రి బెలానిన్‌ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, ‘‘టెలిపోర్ట్‌ క్విజ్‌తో, మా భారతీయ వినియోగదారుల కోరికను తీర్చాలనుకుంటున్నాము. వారికి తగిన గుర్తింపును పొందే అవకాశం మాత్రమే కాదు, యుఏఈ ఎగిరిపోయే అవకాశమూ అందిస్తున్నాం. వినోద రంగంలో వినూత్నమైన సేవలను అందించడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఈ పోటీని పరిచయం చేయడం ద్వారా ఓ  అద్వితీయమైన అవకాశాన్ని అందించడానికి మేము ప్రణాళిక చేశాం.
 
ఇది భారతదేశం నుంచి మేము అందుకుంటున్న ప్రేమాభిమానాలకు మా కృతజ్ఞతను వెల్లడించడాన్ని ప్రతిబింబిస్తుంది. మాకు చక్కటి గుర్తింపును అందించిన భారతదేశంలోని క్రికెట్‌ అభిమానులకు మేము ధన్యవాదములు తెలుపుతున్నాం. ఈ కారణం చేతనే వారి పట్ల మా అనుబంధానికి గుర్తుగా ఐపీఎల్‌ ద్వితీయార్థంను యుఏఈలో వ్యక్తిగతంగా వీక్షించే అవకాశాన్నీ అందిస్తున్నాం..’’ అని అన్నారు
 
అభిమానుల హృదయాలను గెలుచుకునేందుకు మరియు వారికి సంతోషాన్ని అందించేందుకు, వారందిస్తున్న మద్దతును ప్రశంసించేందుకు మేము అనుసరిస్తున్న మార్గం ఈ పోటీ. తమ చేరికను మరింతగా విస్తరించడంతో పాటుగా వినియోగదారుల అభిప్రాయాలను మిళితం చేసేందుకు అత్యంత ఆసక్తికరమైన టెలిపోర్ట్‌ క్విజ్‌ను ఆవిష్కరించేందుకు పీఎంఐ సిద్ధంగా ఉంది. ప్రత్యక్షంగా క్రీడను తిలకించేందుకు విదేశాలకు ఎగిరిపోయే  అవకాశాన్ని ఇది ప్రేక్షకులకు అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెజాన్: రెండు వ్యాపారాలను రీ-బిల్డింగ్ చేసుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన సతీష్‌