Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ తీపికబురు.. ఐపీఎల్-2022 ప్రేక్షకులకు మరింత మజా!

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (19:18 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌) సెకెండ్‌ ఎడిషన్‌ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ అభిమానులకు బీసీసీఐ, ఈసీబీ (ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 
 
ఐపీఎల్ సెకెండ్ మ్యాచ్‌ల కోసం మైదానాల్లోకి ప్రేక్షకులను అనుమతించబోతున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించింది. ఇందుకు యూఏఈ ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపింది. అయితే, ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
 
కాగా, కరోనా కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయిన క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ భావించిన సమయంలో స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తారా..? లేదా అనే విషయంపై పెద్ద చర్చ నడిచింది. 
 
అయితే దానిపై అప్పట్లో బీసీసీఐ కానీ, యూఏఈ ప్రభుత్వం కానీ స్పందించలేదు. దాంతో యూఏఈ క్రికెట్ బోర్డు జనరల్ సెక్రెటరీ ముబాషిర్ ఉస్మాన్‌.. యూఏఈ ప్రభుత్వంతోనూ, ఇటు బీసీసీఐతోనూ మాట్లాడాతమని అప్పట్లో ప్రకటించారు. 
 
ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది ఐపీఎల్ గురించి కూడా అభిమానులకు బీసీసీఐ ఓ తీపికబురు అందించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఐపీఎల్-2022 గురించి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది టోర్నీ ప్రేక్షకులకు మరింత మజా పంచనుందని పేర్కొన్నారు. 
 
అయితే, ఎప్పటిలా 8 జట్లతో కాకుండా.. 10 జట్లతో టోర్నీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ఏ జట్లు కొత్తగా చేరబోతున్నాయనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా సస్పెన్స్‌లో పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్.. డ్యాన్స్‌కు శ్రీనివాస్ ఫిదా (video)

బియ్యం గోడౌన్‌లో గంజాయి బ్యాగ్ పెట్టేందుకు ప్రయత్నించారు, పోలీసులపై పేర్ని నాని ఆరోపణ

భార్యపై కేసు పెట్టారు... తల్లిపై ఒట్టేసి చెప్తున్నా.. పేర్ని నాని

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

తర్వాతి కథనం
Show comments