Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్?

Advertiesment
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్?
, మంగళవారం, 10 ఆగస్టు 2021 (18:45 IST)
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ను ఎంపిక చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదేసమయంలో ప్రస్తుతం ఉన్న కోచ్ రవిశాస్త్రిని సాగనంపే దిశగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పావులు కదుపుతోంది. ఆయన స్థానంలో ప్రధాన కోచ్‌గా బాధ్యతలను రాహుల్ ద్రవిడ్‌కు అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ర‌విశాస్త్రి కోచ్‌గా ప‌నిచేస్తున్న‌ప్ప‌టి నుంచి భార‌త్ అనేక విదేశీ సిరీస్‌లలో విజ‌యం సాధించింది. ఎంతో పురోగ‌మించింది. అయితే ఐసీసీ టోర్నీల్లో స‌త్తా చాట‌లేక‌పోయింది. ఇక రవిశాస్త్రి ప‌ద‌వీ కాలం కూడా ముగియ‌నుంది. దీంతో ఇక‌పై శాస్త్రికి కాకుండా కోచ్ ప‌ద‌విని ద్రవిడ్‌కు అప్ప‌గించాల‌ని బీసీసీఐ ఆలోచిస్తున్న‌ట్లు సమాచారం.
 
మరోవైపు ద్రవిడ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో భార‌త అండ‌ర్ 19 క్రికెట్ జ‌ట్లు వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌లో స‌త్తా చాటాయి. 2016 జ‌రిగిన అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త జ‌ట్టు ర‌న్న‌రప్‌గా నిల‌వ‌గా, 2018లో ఏకంగా విజేత‌గా నిలిచింది. దీంతో ద్రవిడ్ 2019 జూలై 8 నుంచి బెంగ‌ళూరులోని ఎన్‌సీఏకు హెడ్‌గా కొన‌సాగుతున్నాడు. అయితే ఆ ప‌దవీ కాలం రెండేళ్లు. ఇప్ప‌టికే ముగిసింది. 
 
దీంతో ఎన్‌సీఏకు హెడ్ ప‌ద‌వి కోసం బీసీసీఐ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. అయితే మ‌రోమారు ఎన్‌సీఏ హెడ్‌గా ప‌నిచేయాలంటే ద్రవిడ్ మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేయాలి. కానీ అలా జ‌ర‌గ‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. కాగా ఇటీవల శ్రీలంక వెళ్లిన టీమిండియా జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పైగా, శ్రీలంక జట్టును యంగ్ ఇండియా చిత్తుగా ఓడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెట్ అభిమానులకు పండగ లాంటి వార్త.. ఒలింపిక్స్‌లో క్రికెట్?