Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రికెట్ అభిమానులకు పండగ లాంటి వార్త.. ఒలింపిక్స్‌లో క్రికెట్?

Advertiesment
ICC
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) క్రికెట్‌ అభిమానులకు పండగా లాంటి వార్త చెప్పింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎప్పుడు చేర్చినా తాము సిద్ధమేనంటూ బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ఐసీసీతో కలిసి బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేయాలని గతంలోనే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ)తో ఐసీసీ చర్చలు జరిపింది. 
 
అయితే, అప్పుడు బీసీసీఐ అందుకు అంగీకారం తెలపలేదు. కానీ ప్రస్తుతం బీసీసీఐ సానుకూలంగా స్పందించడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఉంటుందని చెబుతున్నారు. 
 
ఇక ఎనిమిది టీమ్‌ల మధ్య పోరు ఉండనున్నట్లు భావిస్తున్నారు. అలాగే ఫార్మట్‌ విషయానికొస్తే టీ 20 లేదా టీ 10లను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో 1900లో పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేశారు. కానీ అనంతరం దానిని కొనసాగించలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీ20 ప్రపంచ కప్ : జట్టును ప్రకటించిన న్యూజిలాండ్