Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్యాంట్ మార్చుకోవడం మరిచిన క్వింటన్ డికాక్.. పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు..! (video)

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (16:41 IST)
Di Kock
సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌ల్లో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటూ వుంటాయి. అలా శుక్రవారం రాత్రి అరబ్ గడ్డపై జరిగిన మ్యాచ్‌లో ముంబై గెలుపును నమోదు చేసుకుంది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను 8 వికెట్లతో ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఆ జట్టు ఓపెనర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ క్వింటన్ డికాక్ మైదానంలోకి దిగాలనే ఆతృతలో ప్యాంట్ మార్చుకోవడం మరిచిపోయాడు.
 
ట్రెయినింగ్ ప్యాంట్‌తోనే సహచర ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి మైదానంలోకి అడుగుపెట్టాడు. అయితే ఈ విషయాన్ని సహచర ముంబై ఆటగాళ్లు గుర్తించి చెప్పడంతో అయోమయానికి గురైన డికాక్.. మళ్లీ ప్యాంట్ మార్చుకోవడానికి డగౌట్‌వైపు పరుగు తీశాడు. ఇంతలో రోహిత్ ట్రెయినింగ్ ప్యాంట్ అని తెలిసేలా ఉన్న ఆరెంజ్ కలర్‌ను కవర్ చేస్తే సరిపోతుందని చెప్పడంతో ఆగిపోయాడు. ఇన్ షర్ట్ తీసి కవర్ చేశాడు. 
 
అయితే ఈ ఘటనతో రోహిత్ నవ్వు ఆపుకోలేకపోయాడు. హిట్‌మ్యాన్‌తో పాటు ముంబై డగౌట్‌లోని ఆటగాళ్లు కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. అయితే టీవీ ముందున్న ప్రేక్షకులకు మాత్రం వాళ్లు ఎందుకు నవ్వుతున్నారో ఆ సమయంలో అర్థం కాలేదు. కానీ కొంతమంది నెటిజన్లు ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అందరికి ఓ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments