Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై సూపర్ కింగ్స్‌లో కరోనా కలకలం : బౌలరు‌తో సహా 10 మందికి పాజిటివ్ (video)

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (19:13 IST)
ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కలకలం చెలరేగింది. జట్టులోని ఆటగాళ్ళకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో పాజిటవ్‌గా నిర్ధారణ అయింది. జట్టులోని ప్లేయర్లలో సుమారు 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం.
 
ప్రస్తుత భారత బౌలర్, పలువురు జట్టు సిబ్బంది సహా గురువారం నాలుగోసారి కరోనా పరీక్షలు చేయించుకోగా శుక్రవారం వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిసింది. కరోనా సోకిన ఆటగాళ్ల పేర్లు తెలియరాలేదు. దీంతో వారికి మరో వారం క్వారంటైన్ పొడిగించారు. దీని వల్ల జట్టు ప్రాక్టీస్‌పై ప్రభావం పడనుంది. 
 
నిజానికి సీఎస్కే జట్టు ఈ నెల 21వ తేదీనే దుబాయ్ చేరుకోగా, క్వారంటైన్ ముగియాల్సిన తరుణంలో కరోనా కారణంగా మరో 7 రోజుల క్వారంటైన్ పొడిగించారు. అంటే సెప్టెంబరు ఒకటో తేదీ వరకు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు. 
 
ఆగస్టు 21న సీఎస్‌కే యూఏఈ చేరగా బీసీసీఐ నిర్దేశించిన ప్రోటోకాల్‌ ప్రకారం ప్రాక్టీస్‌కు ముందు మూడుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ‘ఇటీవల భారతదేశం తరపున ఆడిన ఒక కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలర్‌తో పాటు కొంతమంది సీఎస్‌కే సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని’ ఐపీఎల్‌ సీనియర్ అధికారులు తెలిపినట్లు సమాచారం. 
 





 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలకు చుక్కలు చూపిస్తున్న రోబో కుక్క (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

తర్వాతి కథనం
Show comments