Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2020: ధోనీతో ఆ ఛాన్స్ మిస్సయ్యింది.. ఓ మ్యాచ్‌లో ఆరు పరుగులను..? (Video)

ఐపీఎల్ 2020: ధోనీతో ఆ ఛాన్స్ మిస్సయ్యింది.. ఓ మ్యాచ్‌లో ఆరు పరుగులను..? (Video)
, బుధవారం, 26 ఆగస్టు 2020 (14:27 IST)
Dwayne Bravo-MS Dhoni
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనున్నాడు. ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో... ఐపీఎల్‌లో ఆడనున్న ధోనీ ఆటతీరుపై ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
 
ఇంకా ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాక.. ఐపీఎల్‌లో అతడితో ఆడే స్టార్ క్రికెటర్లు ఆయన్ని పొగిడేస్తున్నారు. అతనితో పోటీ పడేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ధోనీతో ఉన్న జ్ఞాపకాల్ని డ్వేన్ బ్రావో గుర్తు చేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ, బ్రావో కలిసి ఆడుతున్న సంగతి తెలిసిందే. భారత మాజీ కెప్టెన్ అయిన మహేంద్రసింగ్ ధోనీ, వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ అయిన డ్వేన్ బ్రావో మధ్య సుదీర్ఘకాలంగా స్నేహబంధం కొనసాగుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు.. ఐపీఎల్‌లోనూ ప్రత్యర్థులుగా ఈ ఇద్దరూ ఎన్నో మ్యాచ్‌ల్లో తడబడ్డారు. 
 
కొన్ని సార్లు ధోనీ పైచేయి సాధిస్తే.. మరికొన్ని సార్లు డ్వేన్ బ్రావో ఆధిపత్యం చెలాయించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ అయిన ధోనీ క్రీజులో ఉన్నప్పటికీ.. ఓ మ్యాచ్‌లో ఆరు పరుగులను తాను కట్టడి చేయగలిగానని బ్రావో చెప్పాడు. 
 
అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. కాబట్టి.. అతడ్ని ఆ మ్యాచ్‌లో తాను నిలువరించడం తన కెరీర్‌లో పెద్ద సక్సెస్‌గా భావిస్తాను. ధోనీకి మరిన్ని ఓవర్లు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వేయాలని ఆశించాను. కానీ.. ఇక అవకాశం లేదు. ఒక ప్లేయర్‌గా ధోనీ అస్సలు కంగారుపడడు. ఎంత ఒత్తిడినినైనా అతను అధిగమించగలడు. అలానే సహచరుల్లోనూ అతను నమ్మకం, విశ్వాసాన్ని పెంపొందిస్తాడు. గొప్ప కెప్టెన్ల లక్షణం అది.. అంటూ బ్రావో వ్యాఖ్యానించాడు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ - కోహ్లీతో సహా క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు (Video)