భారత్ ఘోర తప్పిదం చేసింది : రికీ పాంటింగ్

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (15:55 IST)
ఐసీసీ ప్రపంచ కప్ కోసం ప్రకటించిన 15 మందితో కూడిన భారత క్రికెట్ జట్టులో యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయక పోవడం ఘోర తప్పిదమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. 
 
సోమవారం రాజస్థాన్‌ రాయల్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ (36 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 78 పరుగులుచేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. అజింక్య రహానే 63 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 (నాటౌట్‌) పరుగులు చేశాడు. అలాగే, కెప్టెన్‌ స్మిత్‌ 32 బంతుల్లో ఎనిమిది ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. 
 
ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. ధావన్‌ 27 బంతుల్లో ఎనిమిది  ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 54 ఇన్నింగ్స్‌ ధాటిగా ఆరంభించగా.. రిషభ్‌ పంత్‌ మెరుపులతో కొండంత లక్ష్యం చిన్నబోయింది.
 
ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్ జట్టు కోచ్ రికీ పాంటింగ్ స్పందిస్తూ, రిషబ్ ఆటతీరుపై ప్రశంసల జల్లు కురపించాడు. పంత్‌ను జట్టులోకి తీసుకోకుండా భారత్‌ ఘోర తప్పిదం చేసిందని చెప్పాడు. పంత్‌ ఇంగ్లీష్‌ కండిషన్స్‌ను సరిగ్గా అర్థం చేసుకునేవాడని చెప్పాడు. 
 
ముఖ్యంగా మిడిల్‌ ఓవర్స్‌లో స్పిన్నర్లను ఓ ఆట ఆడుకునేవాడు. అతన్ని ఎంపిక చేయనప్పుడే చెప్పా.. పంత్‌కు మూడు నాలుగు ప్రపంచకప్‌లు ఆడే సత్తా ఉందని, మళ్లీ చెబుతున్నా.. ఆరోగ్యంగా ఫిట్‌గా ఉంటే పంత్‌కు ఆట విషయంలో తిరుగులేదని చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశాన్ని నాశనం చేస్తున్నారు... పాక్ ఆర్మీ చీఫ్‌పై ఇమ్రాన్ ధ్వజం

ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్ - మోస్ట్ వాంటెండ్ సిగ్మా గ్యాంగ్‌స్టర్లు హతం

బాలికను మూత్ర విసర్జనకు సపోటా తీసుకెళ్లిన నిందితుడు ఆత్మహత్య

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్

టెక్ సిటీలో బెంగుళూరులో వెస్ట్ బెంగాల్ మహిళపై గ్యాంగ్ రేప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

తర్వాతి కథనం
Show comments