Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-11వ సీజన్.. నిరాశ పరిచిన ముంబై ఇండియన్స్..

ఐపీఎల్-11వ సీజన్లో ముంబై ఇండియన్స్ నిరాశపరిచింది. బట్లర్ చెలరేగినా రాజస్థాన్ రాయల్స్ గెలుపును నమోదు చేసుకుని ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా వుంచుకుంది. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ మరో రెం

Webdunia
మంగళవారం, 15 మే 2018 (11:19 IST)
ఐపీఎల్-11వ సీజన్లో ముంబై ఇండియన్స్ నిరాశపరిచింది. బట్లర్ చెలరేగినా రాజస్థాన్ రాయల్స్ గెలుపును నమోదు చేసుకుని ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా వుంచుకుంది. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ మరో రెండు ఓవర్లు మిగిలి వుండగానే పూర్తి చేసింది. ఆదివారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ ముంబైకి చెక్ పెట్టింది. 
 
టాస్ గెలిచి రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఐదో బంతికే షార్ట్ ఔటైనా.. బట్లర్, రహానే నిలకడగా ఆడారు. జోడీని విడదీసేందుకు రోహిత్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా వీలులేకపోయింది. విజయం దిశగా సాగుతున్న రాజస్థాన్‌కు 14వ ఓవర్‌లో రహానే వికెట్ రూపంలో చుక్కెదురైంది. 
 
బట్లర్‌తో కలిసి రెండో వికెట్‌కు 95 పరుగులు జోడించి వెనుదిరిగాడు. ఈ దశలో 26 పరుగులు చేసిన శామ్సన్ ఔటైనా.. బట్లర్ సిక్సర్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వజ్రాలు పొదిగివున్న నెక్లెస్ స్వాధీనం...

ఊగిపోయిన ఢిల్లీ రైల్వే స్టేషన్.. వణికిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే..

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments