Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అభిమానులారా.. సారీ... మీ ముందు ఓడిపోయాం.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈవో

ఐపీఎల్ 2018 ఫ్రాంచైజీ జట్లలో ఒకటైన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఒకటి. ఈ జట్టు ఇప్పటివరకు మొత్తం 12 మ్యాచ్‌లను ఆడి కేవలం 3 మ్యాచ్‌లలో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. పైగా, ఈ జట్ట

అభిమానులారా.. సారీ... మీ ముందు ఓడిపోయాం.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ సీఈవో
, సోమవారం, 14 మే 2018 (15:50 IST)
ఐపీఎల్ 2018 ఫ్రాంచైజీ జట్లలో ఒకటైన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఒకటి. ఈ జట్టు ఇప్పటివరకు మొత్తం 12 మ్యాచ్‌లను ఆడి కేవలం 3 మ్యాచ్‌లలో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. పైగా, ఈ జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించలేకపోయింది. జట్టులోని ఆటగాళ్ల పేలవ ప్రదర్శన కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.
 
ఈ యేడాది ఐపీఎల్‌లో ప్లేఆఫ్‌ అవకాశాలు కోల్పోయిన మొదటి జట్టుగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నిలిచింది. గంభీర్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, శ్రేయాస్‌ అయ్యర్‌ జట్టు పగ్గాలు చేపట్టినా దిల్లీకి కలిసి రాలేదు. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు దిల్లీ ఐపీఎల్‌ టైటిల్‌ను దక్కించుకోలేదు.
 
నిజానికి 2018 ఐపీఎల్ టోర్నీ కోసం ఆ జట్టు యాజమాన్యం.. ఎన్నో ఆశలతో వేలంలో కీలకమైన ఆటగాళ్లను దక్కించుకుంది. కానీ ఆటగాళ్లు మాత్రం మైదానంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. జట్టు పేలవ ప్రదర్శనపై దిల్లీ డేర్‌డెవిల్స్‌ సీఈవో హేమంత్‌ దువా నిరాశతో ఉన్నాడు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
'ఇది మరో కఠినమైన యేడాది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ అభిమానులారా మరోసారి మీ ముందు ఓడిపోయాం. మీరు చేసిన ట్వీట్లన్నీ చదివాను. జట్టు ప్రదర్శన చూసి మీరెంత నిరాశ చెందారో మేమూ అంతే నిరాశ చెందాం. ఇది మీరు నమ్మకపోవచ్చు. కానీ నిజం. గెలవాలనే కసితోనే టోర్నీలో అడుగుపెట్టాం. ఉత్తమ కోచ్‌లను, మంచి ఆటగాళ్లను వేలంలో దక్కించుకున్నాం. 
 
ఈ విషయాన్ని మీరు అంగీకరించారు. గాయాల కారణంగా క్రిస్ మెరిస్‌, కసిగో రబాడ దూరమయ్యారు. కొందరు సీనియర్‌ ఆటగాళ్లు తమ ఫామ్‌ను కోల్పోయారు. రిషబ్‌ పంత్‌, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌ తదితర యువ ఆటగాళ్లు తమ సత్తా చాటారు. వచ్చే యేడాది మరింత బలంగా మీ ముందుకు వస్తాం' అని దువా తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 
 
కాగా, 2008, 2009లో సెమీ ఫైనల్స్‌కు చేరుకున్న ఢిల్లీ ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2012లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఆ తర్వాత నుంచి లీగ్‌ దశలోనే నిష్క్రమిస్తూ వస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరువు గురించి భయం లేదు.. మళ్లీ టెన్నిస్ ఆడుతా.. సర్ నేమ్ మీర్జా-మాలిక్: సానియా