Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రికార్డ్ నాకు తప్ప మరే హీరోయిన్‌కు లేదు: నందితా శ్వేత

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (19:59 IST)
Nandita Shweta
"ఎక్కడికిపోతావు చిన్నవాడా" చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది కన్నడ నాయిక నందితా శ్వేత. ఆ తర్వాత "ప్రేమ కథా చిత్రమ్ 2", "శ్రీనివాస కళ్యాణం" లాంటి చిత్రాల్లో ఆకట్టుకుంది. ఇటీవలే "కపటధారి" చిత్రంతో పలకరించిన నందితా శ్వేత తన కొత్త సినిమా "అక్షర"తో ప్రేక్షకుల ముందుకొస్తోంది.  సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 26న ‘‘అక్షర’’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా "అక్షర" చిత్రంలో నటించిన అనుభవాలను నందితా శ్వేత విలేక‌రుల‌తో పంచుకున్నారు.
 
- నా కెరీర్లో హారర్ ఫిలింస్ ఎక్కువ చేయలేదు. ప్రేమకథా చిత్రమ్2, ఎక్కడికి పోతావు చిన్నవాడా మాత్రమే చేశాను. ఈ చిత్రంలో విద్యార్థులతో ఎక్కువగా మాట్లాడుతాను. ట్విస్ట్ ఉంటుంది కథలో. ఆ మలుపు ఏంటి అనేది చెప్పను. సినిమాలో చాలా ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. ఏదో సందేశం చెబుతున్నాం. మీరు కూర్చుని చూడండి అని ఉండదు. మెసేజ్ కాకుండా సినిమాకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అక్షర నాకు ఒక ఛేంజ్ ఓవర్ మూవీ అనుకోవచ్చు.

కెరీర్ బిగినింగ్ లోనే ఫీమేల్ స్క్రిప్ట్ చేయడం అంటే సాహసం అనుకోవాలి. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు కొంత భయపడ్డాను. ఇప్పుడు నేను సందేశం చెబితే తీసుకుంటారా లేదా అనేది సందేహించాను. కానీ డేర్ డెసిషన్ తీసుకున్నాను. టీమ్ కూడా నన్ను తీసుకోవడంపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అక్షర మూవీ కోసం నన్ను పిలిచినప్పుడు హారర్ మూవీనే కదా అనుకున్నాను. కానీ చిన్న కృష్ణ గారు కథ చెప్పినప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపించింది. షకలక శంకర్, మధు నందన్, సత్య, అజయ్ ఘోష్ చేసిన క్యారెక్టర్లు చేసిన కామెడీ చాలా  బాగుంటుంది.
 
- అక్షర సినిమాలో హారర్  లేదు. సస్పెన్స్ ఉంటుంది. లాక్ డౌన్ లో ఫస్ట్ 3 మంత్స్ రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆన్ లైన్ కోర్సులు చేశాను. వెబ్ సిరీస్ లో ఛాన్సులు వచ్చాయి. కానీ నేను అంగీకరించలేదు. దానికి కారణం. నిర్మాతలు చాలా మంది లాక్ డౌన్ ముందు చేసిన సినిమాలు థియేటర్లోనే రిలీజ్ చేయాలని అనకుున్నారు. ఓటీటీకి ఎక్కువ మంది ఆసక్తి చూపించలేదు. నా సినిమాల్లో ఇటీవల కపటధారి థియేటర్లో రిలీజ్ అయ్యింది. మార్చి నుంచి చూస్తే అక్షరతో కలిపి నేను చేసిన నాలుగు సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. ఇది మరే హీరోయిన్ కు దక్కని ఘనత అనుకోవచ్చు.
 
స్క్రిప్ట్ ఈజ్ హీరో అనుకుంటాను. అందులో నా క్యారెక్టర్ ఎంత బాగుంది,  ఎంత నిడివి ఉంది అని ఆలోచించేదు. అక్షరలో నన్ను ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో చూస్తారు. కపటధారిలో నా క్యారెక్టర్ తక్కువ ఉంది అని కొందరు అన్నారు. సహజంగానే థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ కు తక్కువగానే స్పేస్ ఉంటుంది. ఆ వాస్తవం నాకు తెలుసు. తమిళం, తెలుగులో ఒకేసారి కపటధారి చిత్రాన్ని చిత్రీకరించాం. అదొక కొత్త అనుభవం నాకు.

ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాత్రమే కాదు ఏ సిస్టమ్ అయినా ఫ్లస్ మైనస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఎందుకు చేశామంటే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. స్టూడెంట్స్ సఫర్ అవడం నాకు ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తోంది. మన పిల్లలు కాన్వెంట్ లో చదవాలని తల్లిదండ్రులు అంతా అనుకుంటారు. అలాగే మా పేరెంట్స్ కూడా చిన్నప్పుడు నన్ను పెద్ద స్కూల్ లో వేశారు. ఆ ఏడాది నాకు వారితో అడ్జస్ట్ కావడం చాలా కష్టమైంది. ఇంగ్లీష్ లోనే మాట్లాడాలని అనడ కూడా ఇబ్బంది పడ్డాను. ఫీజ్ కట్టడం కూడా కష్టమైంది. ఆతర్వాత తొమ్మిదో తరగతి నుంచి కార్పొరేషన్ స్కూల్లో జాయిన్ అయ్యాను. నా లాంటి కథే చాలా మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉంటుంది.
 
విద్యా వ్యవస్థలోనే లోపాలను చెబుతున్నాం. కానీ విద్య లేనిదే ఎదగలేము అని చెప్పలేదు. విద్య వల్లే జీవితంలో పైకి వస్తాము అని కాదు. కమ్యునికేషన్ బాగుంటుంది ఎడ్యుకేషన్ ఉంటే. నేను ఉన్నత చదువు వదిలేసి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాను. హీరోయిన్ గా నాకూ పేరు వ‌చ్చింది.
 
ఫ్లాప్ అయితే మూవీస్ రావు అంటారు, గ్లామర్ గా లేకుంటే మూవీస్ రావు అంటారు, ఎడు ఏనిమిది సినిమాలు చేశాను. నందిత సినిమా చేయలేదు అని ఎవరూ అనరు. ఇప్పటికీ అవకాశాలు బాగానే వస్తుంటాయి. అక్షర లాంటి చిత్రం చేశాను సంతృప్తిగా ఉంది. ప్రతి సినిమా కష్టపడే చేస్తుంటాము. విజయం, అపజయం నా చేతిలో లేదు.
 
- ప్ర‌స్తుతం  రాజు గారి గది హీరో అశ్విన్‌తో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. అందులో ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. చాలా కష్టపడి నటిస్తున్నాను. దబాంగ్ మూవీకి తమిళ్, తెలుగు, కన్నడ కు డబ్బింగ్ చెప్పాను. శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నా డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను. నేను ఇంట్రోవర్ట్, ఎక్కువగా అందరితో కలవను కాట్టి లాక్డౌన్ పెద్దగా ఇబ్బంది అనిపించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

మా సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోండి.. బీఆర్ నాయుడికి హరీశ్ వినతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments