సినిమా దర్శకుడు కావాలంటే ముందుచూపు వుండాలి. సమాజంపై అవగాహన వుండాలి. తన చుట్టు పక్కల పరిసరాలను పరిశీలిస్తుండాలి. ఏది తప్ప్పో ఒప్పో తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు సినిమా తీస్తే ఆయన ఆలోచనల ప్రభావం సమాజంపై పడుతుంది. అది మంచి కోసమే అయివుండాలి. ఏదో టైం ఉద్యోగం కాదు. ఒకప్పుడు ఏపనిలేకపోతే, చదువు సంథ్యలేకుండా బేవార్స్‌గా తిరుగుతుంటే తెలిసిన దర్శకుల వద్దకు కుర్రాళ్ళను తీసుకువచ్చి వీడు ఎందుకు పనికిరాకుండా వున్నాడు. కనీసం నీ దగ్గర అసిస్టెంట్‌గా పెట్టుకో అని రాజకీయనాయకులు, వ్యాపరవేత్తలు, స్నేహితులు అంటుండేవారు.
అలా ప్రముఖ దర్శకుల వద్ద అసిస్టెంట్లుగా పలువురు పనిచేసి దర్శకులుగా ఎదిగినవారు బాగానే వున్నారు. అయితే ఆ ధోరణిలో కొందరు సినిమాలు తీసి ప్రేక్షకులకు అర్థంకాకుండా పజిల్స్‌గా పెట్టి వారి పైత్యాన్ని వెండితెరపై చూపించి అభాసుపాలైన వారూ వున్నారు. దీనితో సినిమావాళ్ళంటే చులకన భావం ఏర్పడింది. అది ఇప్పటికీ పోలేదనుకోండి. కానీ పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు అలాంటి వారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని విశ్లేషకులు అంటున్నారు.
ఇలాంటి సంఘటన `అక్షర` అనే సినిమా వేడుకలో జరిగింది. ఆ వేడుకకు సి.ఎం. కె.సి.ఆర్. కుమార్తె కవిత హాజరయ్యారు. ఆమె విద్య గురించి సమాజంలో పిల్లలు, తల్లదండ్రులకు కనువిప్పు కలిగే సినిమాగా వుండాలని చక్కగా మాట్లాడింది. కానీ ఆ వేడుకలో వున్న `స్వామిరారా చిత్రాన్ని తీసిన దర్శకుడు సుధీర్ వర్మ మాత్రం పూర్తి భిన్నంగా మాట్లాడాడు. ఏదో రెండు ముక్కలు మాట్లాడితే తన పని అయిపోయిందనుకున్నాడు.
ఆ మాటతో సమాజంలో చులకన అనే భావన ఇప్పటికీ వున్నాయి. ఆయన మాటల్లో విందాం.. .నేను చిన్నికృష్ణ మేమంతా ఫ్రెండ్స్. నేను చదువుల్లో వీక్ అందుకే దర్శకుడిని అయ్యాను. బాగా చదువుకుంటే ఏ ఉద్యోగమో చేసుకునేవాడిని. అక్షర సినిమా టీమ్‌కు నా బెస్ట్ విషెస్ చెబుతున్నాను అన్నారు. అక్కడే వున్నవారితోపాటు కవిత కూడా ఆశ్చర్యపోయి చూస్తుండిపోయారు. ఏమి చేస్తారు మరి.