Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘అక్షర’ ఆలోచ‌న‌లు ఆలోచింప‌జేస్తాయి: త్రివిక్రమ్

‘అక్షర’ ఆలోచ‌న‌లు ఆలోచింప‌జేస్తాయి:  త్రివిక్రమ్
, మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (18:49 IST)
Akshara trailer launch Trivikram
నందిత శ్వేతా ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘‘అక్షర’’. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘అక్షర’’ సినిమా టీజర్ ను మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు.  ఆయ‌న మాట్లాడుతూ , ‘‘ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. చిన్ని కృష్ణ  స్త్రీ పాత్రలను బలంగా రాయగలడు. విద్యా వ్యవస్థ పై ఆయన నలుగురితో కోవాలనుకుంటున్న ఆలోచనలు అందరినీ ఆలోచింప జేస్తాయని నమ్ముతున్నాను’ అన్నారు
 
అక్షర ట్రైలర్ ఏముందుంటే,
అఖిల విశ్వాన్ని శాసించే ఆది శక్తి అక్షరమే అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. మన దేశంలో సగటున ప్రతి గంటకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడని స్లైడ్ లో చూపించారు. విద్యా వ్యవస్థ ఎలా వ్యాపారమయం అయ్యిందో చూపించే కథతో సినిమా చేసినట్లు తెలుస్తోంది. ఫీజుల కోసం, ర్యాంకుల కోసం కొన్ని ప్రైవేట్ కళాశాలలు చేస్తున్న అక్రమాలను ‘‘అక్షర’’ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఫిజిక్స్ చెప్పే టీచర్ అక్షర పాత్రలో నందిత శ్వేతా కనిపిస్తోంది.

ఆమె క్యారెక్టర్ లో ఇంటెన్స్ ఫర్మార్మెన్స్ ఆకట్టుకుంటోంది. విద్యార్థిని తండ్రిగా, ఈ విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా మాట్లాడే పాత్రలో హర్ష నటించారు. కాలేజ్ మాఫియాను నడిపించే పాత్రను సంజయ్ స్వరూప్ పోషించినట్లు తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్ గా శత్రు పవర్ ఫుల్  క్యారెక్టర్ చేశారు.

ఇన్వెస్టిగేషన్లో చచ్చిన వాళ్లకు నీకు ఏంటి సంబంధం అని శత్రు అడిగితే, జనం లోకి వెళ్లాలి అనే సమాధానం అక్షర ఇచ్చింది. అంటే విద్యా వ్యాపారంలోని అక్రమాలను సమాజానికి చెబుతూ, ఈ నిజాలు జనాల్లోకి వెళ్లాలి అనే అక్షర చెబుతున్నట్లు ఉంది. ఇలా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సినిమా ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలావుంటే ఎస్కేప్, ఇలా ఉంటే ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి: సంగీత దర్శకుడు మాలిక్‌