Webdunia - Bharat's app for daily news and videos

Install App

వావ్... ప్రియాంక జవాల్కర్, టాప్ స్టార్ల నుంచి ఆఫర్లు కొట్టేస్తుందా?

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (18:30 IST)
Priyanka Jawalkar
టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్. ఇటీవల స్పీడ్ పెంచిన ఈ నాయిక తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. ఈ రెండు చిత్రాల్లో ప్రియాంక అందం, నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో పాత్రికేయులతో ముచ్చటించింది ప్రియాంక. ఆమె ఇంటర్వ్యూ హైలైట్స్ చూస్తే..
 
- నేను కొంత గ్యాప్ తరువాత నటించిన తిమ్మరుసు హిట్ అయ్యిందని అందరూ అన్నారు. ఎస్ఆర్ కల్యాణమండపం సెకండ్ వేవ్ తరువాత ఫస్ట్ హిట్ అంటున్నారు. థియేటర్ కి ప్రేక్షకులు వస్తారా రారా అనే ఒక డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు థియేటర్స్ కు ఆడియన్స్ విపరీతంగా వస్తున్నారు,  చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ జాగ్రత్తలు పాటిస్తూనే థియేటర్స్ కి వస్తున్నారు.

తిమ్మరుసు విడుదల తరువాత  గ్లామర్ పై కొంత కేర్ తీసుకొని వెయిట్ లాస్ అయ్యాను. నేనే వంట చేసుకోవడం ప్రారంభించా. టాక్సీవాలా సినిమా తరువాత సెలెక్టెడ్ గా స్క్రిప్ట్స్ ఎంచుకొని మూవీస్ సైన్ చేశాను. గమనం సినిమాలో నా రోల్ చిన్నదే అయిన బాగా నచ్చి ఒప్పుకున్నాను. 
 
- నేను నటించిన సినిమాలకు నా ఫ్రెండ్స్ పెద్ద క్రిటిక్స్. వాళ్ళు నేను ఎక్కడ బాగా చేశాను ఎక్కడ మిస్ అయ్యాను వాళ్ళు చెబుతుంటారు. డైరెక్టర్ చెప్పినట్లు చెయ్యడమే నా లక్ష్యం, వారి వల్లే నాకు మంచి రోల్స్ వస్తున్నాయి. బయట నామీద వచ్చే నెగిటీవ్ ను లైట్ తీసుకుంటాను, పాజిటివ్ ను మాత్రమే ఎంజాయ్ చేస్తాను. ఇప్పటిదాకా మంచి సినిమాల్లో నటించాను భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి పాత్రల్లో నటించాలని ఉంది. ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నా డాన్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని డాన్స్ నేర్చుకుంటున్నాను.  
 
- తెలుగులో కొన్ని స్క్రిప్ట్స్ విన్నాను త్వరలో ఫైనల్ చేస్తాను. ఓటిటి ఆఫర్స్ వస్తున్నాయి, స్టోరీస్ విన్నాను, కొన్ని ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి పాత్రలే చెయ్యాలని లేదు, నాకు నచ్చిన పాత్ర ఏదైనా చేస్తాను. తమిళ్ లో ఒక సినిమా సైన్ చేశాను. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తా. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments