Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జూమ్ యాప్' ద్వారా పెళ్లిళ్లు చేసుకుంటాం సరే.. మరి శోభనం సంగతేంటి?

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (13:30 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ కమ్మేసింది. ఈ వైరస్ బారిపడి దాదాపు 210 దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు ఆయా ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో ఒక్క నిత్యావసర సేవలు మినహా మిగిలిన సేవలన్నీ పూర్తిగా ఆగిపోయాయి. అదేసమయంలో ముందుగా కుదుర్చుకున్న వివాహాది శుభకార్యాలన్నీ వాయిదాపడుతున్నాయి. అయితే, కొందరు మాత్రం వీడియో కాల్స్ ద్వారా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో వివాహాలు వాయిదా పడకుండా ఉండేందుకు న్యూయార్క్ ప్రభుత్వం తాజాగా ఈ విషయంపై సానుకూలంగా ఆదేశాలు జారీచేసింది. వీడియో కాల్స్‌ ద్వారా పెళ్లి చేసుకుంటే సామాజికదూరం పాటిస్తూనే, వివాహం కూడా జరుపుకునే అవకాశం ఉండడంతో వాటికి అనుమతి ఇచ్చింది.
 
'పెళ్లిళ్ల విషయంలో ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. జూమ్‌ వీడియో కాల్ యాప్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు' అని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. న్యూయార్క్‌ వాసులు వీడియో కాల్స్‌ ద్వారా పెళ్లిళ్లు చేసుకునేందుకు వీలుగా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్ జారీ చేస్తున్నానని తెలిపారు. ఇటువంటి పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
 
దీంతో పెళ్లికి సిద్ధమైన యువత గవర్నర్‌ చేసిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జూమ్ యాప్ ద్వారా ఒక్కటయ్యే జంటలు శోభనాలను ఏ విధంగా జరుపుకోవాలన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇదే అంశంపై నెటిజన్లు కూడా తమకు తోచిన రీతిలో సెటైర్లు వేస్తున్నారు. కాగా, న్యూయార్క్‌లో ఇప్పటివరకు కరోనా బారిన పడి దాదాపు 13,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments