Publish Date: Fri, 17 Apr 2020 (14:28 IST)
Updated Date: Fri, 17 Apr 2020 (14:31 IST)
గాలిలోని వ్యాధికారక సూక్ష్మ జీవులను చంపేశక్తి అరటిలో ఉందట. అరటికి తీపి, వగరు, రుచులు కలిగి చలువ చేసే గుణం ఉంది. దేహపుష్టిని పెంచుతుందట. అరటిపండు మధ్యలో మిరియాల పొడి చూర్ణాన్ని ఉంచి తింటే ఎంతటి మొండి దగ్గు అయినా తగ్గిపోతుందట.
అరటి దుంపను మెత్తగా నూరిన దాన్ని పొత్తి కడుపు మీద వేసి కడితే వెంటనే ఆగిన మూత్రం బైటికి వస్తుందట. అంతే కాకుండా అరటి ఊచ రసాన్ని సేవిస్తుంటే ఆగిన బహిస్టు మళ్ళీ మొదలై సాఫీగా వస్తుంది.
స్త్రీలలో వచ్చే ఎర్రబట్టకు అరటిపండు, నెయ్యి చక్కటి ఔషధం. అరటిపువ్వు దంచి రసం తీసి వడగట్టి పెరుగు అంతే మోతాదులో కలిపి తింటుంటే రక్త జిగట విరేచనాలు ఆగిపోతాయట. అరటి ఆకులో అన్నం తింటే ఆయువు వృద్ధి, ఆరోగ్యం కూడా. అందుకే పెళ్ళి, పండుగ దినాల్లో అరటి ఆకులను వేసి మరీ వడ్డిస్తుంటారు.
పెళ్ళి పందిళ్ళకు అరటి స్థంభాలకు కట్టడం వల్ల శుభ సంకేతమే కాకుండా, గాలిలోని వ్యాధికారక సూక్ష్మజీవులను చంపే శక్తి అరటిలో ఉంది. రక్తవిరేచనాలు, రక్తస్రావం, రక్తవాంతులు, అతిసారం మూత్రావయావాల్లో రాళ్ళు ఈ వ్యాధులన్నింటినీ అతి సులువుగా జయించగల శక్తి అరటిలో ఉందట.