Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-04-2020 శుక్రవారం దినఫలాలు - కనకదుర్గాదేవిని పూజించినా సర్వదా శుభం

Advertiesment
17-04-2020 శుక్రవారం దినఫలాలు - కనకదుర్గాదేవిని పూజించినా సర్వదా శుభం
, శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (05:00 IST)
మేషం : ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒక వ్యవహారం నిమిత్తం బాగా శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న సంకల్పం నెరవేరదు. స్త్రీలతో మితంగా సంభాషించండి. 
 
వృషభం : ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ధైర్యంగా ముందుకుసాగిపోగలరు. మీ మాటతీరు, మన్ననలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ప్రముఖుల కలయిక అనుకూలించినా ఆశించిన ప్రయోజనం ఉండదు. వాహనచోదకులకు అప్రమత్తం అవసరం. 
 
మిథునం : స్త్రీలు అయినవారి నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. క్రయ విక్రయాలు ఆశించినంత లాభసాటిగా ఉండవు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం బలపడుతుంది. ఖర్చులు, చెల్లింపుల్లో ఏకాగ్రత వహించడి. ఆపత్సమయంలో సన్నిహితుల అండగా నిలుస్తారు. 
 
కర్కాటకం : వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నోటీసులు, రశీదులు అందుకుంటారు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. 
 
సింహం : ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధిం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. పిల్ల ఆరోగ్యంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి అందిన ఒక సమాచారం మీలో కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. 
 
కన్య : కుటుంబ సమస్యలు, వ్యాపారలావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. మొండిబాకీలు వసూలవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. 
 
తుల : తోటల రంగాల వారికి ఆసక్తి పెరుగుతుంది. సోదరీ, సోదరుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించినా సత్ఫలితాలిస్తాయి. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. 
 
వృశ్చికం : మీడియా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికం. భాగస్వామిక వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధువుల ఆకస్మిక రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. రాజకీయ నాయకుల కదలికలపై విద్రోహులు కన్నేసిన విషయం గమనించండి. ఆత్మీయులు, కుటుంబీకులతో సంతోషంగా గడుపుతారు. 
 
ధనస్సు : మీ ప్రియతముల పట్ల, ముఖ్యుల పట్ల శ్రద్ధ పెరుగును. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. పాత వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మంచికిపోతే చెడు ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కొంటారు. స్త్రీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
 
మకరం : ఉపాధ్యాయులకు పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ఇతరుల మీ నుంచి ఏమి కోరుకుంటున్నారో ముందు తెలుసుకోండి. మీ మాటతీరు, వాక్‌చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపార రంగాల్లో వారికి పురోభివృద్ధి. అనుకున్న పనులు వాయిదాపడతాయి. 
 
కుంభం : ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. క్రీడల పట్ల కళల పట్ల ఆసక్తి పెరుగును. నూతన గృహం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పనిచేసే చోట కొన్ని మార్పులు సంభవిస్తాయి. స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. 
 
మీనం : ప్రియతములను కలుసుకుంటారు. ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను వదులుకోవడం మంచిదికాదు. మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. బ్యాంకులు, లావాదేవీలకు అనుకూలం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12 రాశుల వారు పూజించాల్సిన వినాయకుడు...