Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగికదాడులకు మహిళలు ధరించే దుస్తులు కూడా కారణమే: పాక్ పీఎం

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (12:21 IST)
దేశంలో లైంగికదాడులకు మహిళలు ధరించే దుస్తులు కూడా ఒక కారణమేనని వ్యాఖ్యలు పలువురు చేయగా పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరింత ఘాటు వ్యాఖ్యలు చేసి మరో దుమారం రేపారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దేశంలో లైంగిక వేధింపుల కేసుల పెరుగుదలకు మహిళల దుస్తులు, వస్త్రధారణే కారణమని వ్యాఖ్యలు చేశాడు. 
 
మహిళలు ధరించే దుస్తుల ప్రభావం పురుషులపై పడుతుందని అది చూస్తూ అలాగే ఉండేందుకు మగవాళ్లు రోబోలు కాదు కదా అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఆయన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. 
 
ఒక దేశ ప్రధాని యే ఇలా మాట్లాడడం పై ఆ దేశ ప్రతిపక్ష పార్టీలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. కాగా.. ఇమ్రాన్ వ్యాఖ్యలను వక్రీకరించారని, తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన డిజిటల్ మీడియా విభాగం ప్రతినిధి డాక్టర్ అర్స్లాన్ ఖలీద్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం