గూగుల్ ప్లే స్టోర్లోకి పబ్జీ ఇండియా.. బీటా వెర్షన్‌లో అందుబాటులోకి..?

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (12:06 IST)
భారత్‌లో పబ్జీ మొబైల్ గేమ్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో ఆ గేమ్ మళ్లీ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవలే ఆ గేమ్ బీటా వెర్షన్ను గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి వచ్చింది. 
 
చాలామంది దాన్ని డౌన్ లోడ్ చేసి ఆడుతున్నారు. అయితే ఈ సమయంలో కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) కేంద్రమంత్రి, ఐటీ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు ఆ గేమ్ బ్యాన్ చేయాలని లేఖ రాసింది. 
 
బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో సదరు కంపెనీ, భారత చట్టాలను అధిగమించి బ్యాక్ డోర్ ఎంట్రీ ఇస్తుందని, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా భారత జాతీయ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పు మాత్రమే కాదని, యువ తరాలకు హానికరం అని లేఖలో ప్రస్తావించారు. 
 
జాతీయ భద్రతకు అపాయమని, మిలియన్ల మంది భారతీయ ప్రజల డేటాను తస్కరిస్తుందని, గోప్యతకు ప్రమాదాన్ని సృష్టిస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఆ గేమ్‌ను ప్లే స్టోర్ ప్లాట్‌ఫామ్‌లో ఉపయోగించడానికి అనుమతించవద్దని గూగుల్‌ను కూడా కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments