కాబూల్ విమానాశ్రయం మూసివేత : తాలిబన్ల నిర్ణయం

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (12:37 IST)
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాలిబన్ పాలకులు మూసివేశారు. పాశ్చాత్య దేశాలు తమ పౌరులు, సైనికుల తరలించే ప్రక్రియలో విమానాశ్రయాన్ని నాశనం చేశారని.. మరమ్మతుల కోసం తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. పైగా, మరమ్మతులు పూర్తయిన తర్వాత పునరుద్ధరిస్తామంటూ తాలిబాన్ల సీనియర్‌ నేత అనాస్‌ హక్కానీ బుధవారం వెల్లడించారు.
 
కాబూల్‌ ఎయిర్‌పోర్ట్ల్ నుంచి అతి త్వరలోనే రాకపోకలు ప్రారంభిస్తామని తెలిపారు. చేసేది లేక అఫ్ఘాన్‌ను వీడాలనుకుంటున్న వారు సరిహద్దుల బాట పట్టారు. దేశ సరిహద్దుల వద్ద, దేశంలోని బ్యాంకుల వద్ద ప్రజలు పెద్దసంఖ్యలో బారులు తీరారు.
 
కాగా, ఆప్ఘన్‌ను అమెరికా సారథ్యంలోని నాటో బలగాలు వీడిన తర్వాత ఆ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు ఆక్రమించుకున్న విషయం తెల్సిందే. తాలిబన్లు దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఆప్ఘన్ పౌరులు దేశం వీడి వెళ్ళిపోయేందుకు తండోపతండాలుగా కాబూల్ ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments