Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆప్ఘాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహణర సరైనదే : జో బైడెన్

Advertiesment
ఆప్ఘాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహణర సరైనదే : జో బైడెన్
, బుధవారం, 1 సెప్టెంబరు 2021 (09:29 IST)
ఆప్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ సరైన నిర్ణయమే కాదు ఎంత తెలివైన నిర్ణయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు. ఆఫ్ఘన్‌ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ అనంతరం బైడెన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. 
 
ఆప్ఘాన్‌లో రెండు దశాబ్దాల సుదీర్ఘ పోరాటానికి ముగింపుపలుకుతూ.. లక్షా 20 వేల మందిని ఆఫ్ఘన్‌ నుంచి తరలించే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని, ఇందులో ఎలాంటి పొరపాటు లేదన్నారు.
 
ఈ బలగాల ఉపంసరణ నిర్ణయం తాను ఒక్కడినే తీసుకున్నది కాదన్నారు. దేశ ప్రజలు, మిలటరీ సలహాదారులు, యుద్ధభూమిలో ఉన్న సర్వీస్‌ చీఫ్‌లు, కమాండర్ల ఏకగ్రీవ సిఫారసుతోనే ఆప్ఘన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 
 
బలగాల తరలింపుపై అమెరికన్లకు తాను హామీ ఇచ్చానని, ఇప్పుడు దానిని నిలబెట్టుకున్నానని వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు ఇతర దేశాల్లో కూడా టెర్రరిజంపై అమెరికా పోరు కొనసాగుతుందని, అయితే అక్కడ అడుగుపెట్టకుండా ఈ పోరును కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఓటరు నమోదుకు మళ్లీ అవకాశం