Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనతో శృంగారంలో పాల్గొనలేదని భర్తను చితక్కొట్టిన భార్య..

Webdunia
గురువారం, 30 మే 2019 (14:46 IST)
శృంగారంలో పాల్గొనలేదనే కోపంతో ఓ భార్య తన భర్తను చితకబాదింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ సంఘటన అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో చోటుచేసుకుంది. భర్తపై దాడి చేయడమే కాకుండా ఏకంగా పోలీసులకు తానే స్వయంగా ఫోన్ చేసి భర్త తనపై దాడి చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫోన్ మేరకు పోలీసులు హుటాహుటిన వాళ్ల ఇంటికి వెళ్లారు. 
 
అయితే అక్కడికి వెళ్లిన పోలీసులు ఆమెను గమనించారు. అయితే ఆమె ఒంటిపై ఒక్క దెబ్బ కూడా లేకపోవడంతో అనుమానంతో పోలీసులు ఇంటిలోని పిల్లలను ఏం జరిగింది అని అడగ్గా దానికి సమాధానంగా పిల్లలు మా డాడీ ఎలాంటి దాడి చేయలేదని, మా మమ్మీయే డాడీపై దాడి చేసిందని చెప్పారు. దాడికి సంబంధించి భర్తను వివరాలు అడిగిన పోలీసులు భర్త చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు. 
 
తన భార్య ఫుల్లుగా మందుతాగి మత్తులో ఉందని, ఆ మత్తులో తన వద్దకు వచ్చి శృంగారంలో పాల్గొనాలని అతి బలవంతం చేసినట్లు చెప్పాడు. తన పిల్లల ముందు భార్య ప్రవర్తన చూసిన భర్త ఆమె అడిగిన దానికి తిరస్కరించానని చెప్పాడు. 
 
దాంతో తీవ్ర ఆవేశానికి లోనైన ఎరికా తన భర్తను చేతికి అందిన వస్తువు తీసుకుని చితక్కొట్టింది. సదరు మహిళ మద్యంతో పాటు డ్రగ్స్ కూడా తీసుకుని ఉంటుందని అనుమానించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments