Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా మిలియన్ డ్రా.. ప్రైజ్ మనీ 160 కోట్ల డాలర్లు.. అదృష్టవంతువుడెవరో?

Webdunia
ఆదివారం, 21 అక్టోబరు 2018 (15:21 IST)
అమెరికా లాటరీ చరిత్రలోనే మెగా మిలియన్ డ్రాను ఈనెల 23వ తేదీన ప్రకటించనున్నారు. ఈ లాటరీలో విజేతలుగా నిలిచేవారికి 160 కోట్ల డాలర్లను బహుమతిగా అందజేయనున్నారు. అంటే భారతీయ కరెన్సీలో ఈ మొత్తం విలువ రూ.11,756 కోట్లు. మంగళవారం మెగా మిలియన్స్ డ్రాలో ఈ మొత్తం అందుబాటులో ఉండనుంది.
 
నిజానికి గత శుక్రవారం నిర్వహించిన డ్రాలో ఎవరూ దీనిని గెలుచుకోలేకపోయారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రాలో ఎవరూ 15, 23, 53, 65, 70, మెగా బాల్ 7 నంబర్లను అందుకోలేకపోయారు. ఇప్పుడు మంగళవారం నిర్వహించబోయే డ్రాలో ఎవరైనా ప్లేయర్ ఈ ఆరు నంబర్లను సాధించగలిగితే ఈ జాక్‌పాట్‌ను సొంతం చేసుకోవచ్చు. కానీ, మెగా మిలియన్స్ జాక్‌పాట్‌ను గెలిచే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. 
 
ఒకవేళ ఎవరైనా గెలుచుకుంటే మాత్రం ఈ ప్రైజ్ మనీని రెండు విధాలుగా అందచేస్తారు. అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే 90.4 కోట్ల డాలర్లు (సుమారు రూ.6600 కోట్లు) అందచేస్తారు. లేదా 160 కోట్ల డాలర్ల మొత్తాన్ని రానున్న 29 ఏళ్లలో విడతల వారీగా అందజేస్తారు. 
 
అమెరికా చరిత్రలోనే పవర్‌బాల్ అతి పెద్ద లాటరీ ప్రైజ్‌మనీ అందిస్తూ వస్తోంది. గతంలో 2016లో అత్యధికంగా 158 కోట్ల డాలర్ల ప్రైజ్‌మనీ అందించింది. మెగా మిలియన్స్ టికెట్లను అమెరికాలోని 44 రాష్ట్రాలతోపాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, వర్జిన్ ఐలాండ్స్‌లో అమ్ముతారు. ఒకరి కంటే ఎక్కువ విజేతలు వస్తే ప్రైజ్‌మనీని సమానంగా పంచుతారు. మొత్తం 24 మెగా మిలియన్స్ డ్రాలలో జులై 24 నుంచి ఒక్క టాప్ విన్నర్ కూడా లేకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments