దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి మరికొద్దిరోజుల్లో తన కొత్త చిత్రాన్ని పట్టాలపైకి ఎక్కించనున్నారు. టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్‌లు హీరోలుగా మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్నారు. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నాయి. మరో వైపు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు సాగుతున్నాయి. అయితే ఒకవైపు ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి మరోవైపు ఇద్దరు స్టార్ హీరోలు. వీరి కాంబినేషన్‌లో చిత్రం అంటే ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ క్రమంలో ఎంత ఖర్చుతో అయిన నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఓవర్సీస్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాతగా ఉన్న దానయ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే ఆయనకి రూ.100 కోట్లు ఇచ్చేందుకు అయిన సిద్ధమని వారు అంటున్నారట. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.
కాగా, ఈ చిత్రం 2020లో విడుదలకానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నాడు. ట్రిపుల్ ఆర్ పేరుతో ప్రచారం జరుపుకుంటున్న ఈ చిత్ర కథ బ్రిటీష్ కాలం నేపథ్యంలో జరగుతుందట. రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్రం షూటింగ్ జరుగనుంది.