తనకు బద్ధశత్రువుగా ఉన్న రష్యాతో భారత్ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై అగ్రరాజ్యం అమెరిగా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పంద ఫలితం మున్ముందు తెలుస్తుందంటూ బాంబు పేల్చారు.
అమెరికా తన శత్రువులను ఎందుర్కొనేందుకు ప్రత్యేకంగా 'క్యాట్సా' అనే చట్టాన్ని తెచ్చి అమలుచేస్తోంది. ఈ చట్టం ద్వారా ఇరాన్, ఉత్తర కొరియా, రష్యాలపై అమెరికా ఇప్పటికే నిషేధం అమలు చేస్తోంది. ఈ కోవలోనే రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న భారత్‌పైనా ఆంక్షలు విధించే సూచనలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వద్ద ప్రస్తావిస్తే, 'అవేంటో భారత్ తెలుసుకుంటుంది. మీరు అనుకున్నంత సమయం కూడా పట్టదు. ఆ దేశానికి త్వరలోనే తెలిసొస్తుంది. మీరే చూస్తారు' అని ట్రంప్ సమాధానమిచ్చారు. మరోవైపు అమెరికా ఆంక్షలకు భయపడేది లేదని, భారత్‌తో మరిన్ని రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటామని రష్యా స్పష్టం చేసింది.