Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 21 March 2025
webdunia

దీపావళి స్పెషల్ సేల్.. ఒక్క రూపాయికే మొబైల్ ఫోన్లు

Advertiesment
దీపావళి స్పెషల్ సేల్.. ఒక్క రూపాయికే మొబైల్ ఫోన్లు
, ఆదివారం, 21 అక్టోబరు 2018 (14:56 IST)
దీపావళి పండుగను పురస్కరించుకుని షియోమీ ప్రత్యేక సేల్స్‌ను నిర్వహించనుంది. తన ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో ఎంఐ సేల్ పేరిట ఈ స్పెషల్ సేల్ ఆఫర్ కొనసాగనుంది. ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నది. ఇందులో పలు షియోమీ స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ యాక్ససరీలను కేవలం రూ.1కే ఫ్లాష్ సేల్‌లో విక్రయించనున్నారు. అలాగే ప్రొడక్ట్స్ కొనుగోలుపై వినియోగదారులకు రూ.50, రూ.100, రూ.200, రూ.500 విలువ గల డిస్కౌంట్ కూపన్లను కూడా అందివ్వనున్నారు. ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు సేల్ ప్రారంభం కానుంది.
 
ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా, తగ్గింపు ధరకు లభించనున్న షియోమీ ప్రొడక్ట్స్ వివరాలను పరిశీలిస్తే, ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీ 4ఎ (43) - రూ.21,999 (రూ.వెయ్యి తగ్గింపు), ఎంఐ ఎ2 - రూ.14,999 (రూ.2 వేలు తగ్గింపు), రెడ్‌మీ నోట్ 5 ప్రొ (6జీబీ+64జీబీ) - రూ.14,999 (రూ.2 వేలు తగ్గింపు), రెడ్‌మీ నోట్ 5 ప్రొ (4జీబీ+64జీబీ) - రూ.12,999 (రూ.2 వేలు తగ్గింపు), రెడ్‌మీ వై2 (4జీబీ + 64జీబీ) - రూ.10,999 (రూ.2వేలు తగ్గింపు),  ఎంఐ బాడీ కంపోజిషన్ స్కేల్ - రూ.1,799 (రూ.200 తగ్గింపు), ఎంఐ బ్లూటూత్ స్పీకర్ బేసిక్ 2 - రూ.1,599 (రూ.200 తగ్గింపు) ఉన్నాయి. 
 
అలాగే, 2000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్ 2ఐ వైట్ - రూ.1,399 (రూ.100 తగ్గింపు), ఎంఐ సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ - రూ.999 (రూ.100 తగ్గింపు), ఎంఐ బ్యాండ్ - హెచ్‌ఆర్‌ఎక్స్ ఎడిషన్ - రూ.999 (రూ.300 తగ్గింపు), ఎంఐ బ్లూటూత్ ఆడియో రిసీవర్ - రూ.899 (రూ.100 తగ్గింపు), ఎంఐ రూటర్ 3సి - రూ.899 (రూ.100 తగ్గింపు), ఎంఐ బ్లూటూత్ హెడ్‌సెట్ బేసిక్ బ్లాక్ - రూ.799 (రూ.100 తగ్గింపు), ఎంఐ సెల్ఫీ స్టిక్ - రూ.599 (రూ.100 తగ్గింపు), ఎంఐ ఇయర్ ఫోన్స్ - రూ.599 (రూ.100 తగ్గింపు), ఎంఐ ఇయర్‌ఫోన్స్ బేసిక్ - రూ.349 (రూ.50 తగ్గింపు)  తదితర వస్తువులపై డిస్కౌంట్ ప్రకటించింది. 
 
అంతేకాకుండా, షియోమీ నిర్వహించనున్న ఎంఐ దీపావళి సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే రూ.750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను ఇస్తారు. అందుకుగాను వినియోగదారులు కనీసం రూ.7500 ఆపైన విలువ గల ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే రెడ్‌మీ నోట్ 5 ప్రొ, పోకో ఎఫ్1 ఫోన్లను పేటీఎం ద్వారా కొనుగోలు చేస్తే రూ.500 క్యాష్‌బ్యాక్ ఇస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉజ్జయిని మహాకాళి ఆలయాన్ని పేల్చేస్తాం : పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు