Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవునా... రెండు యుద్ధ నౌకలు ఉన్నాయి.. మేం బెదిరేదిలేదు!!

Webdunia
సోమవారం, 6 జులై 2020 (14:10 IST)
చైనాకు అమెరికా దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది. దక్షిణ చైనా సముద్ర జనాల్లో డ్రాగన్ కంట్రి ఆధిపత్యాన్ని తగ్గించేందుకు అమెరికా సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇందులోభాగంగా, ఇటీవల రెండు ఎయిర్ క్రాఫ్ట్ కారియర్‌లు యూఎస్ఎస్ నిమిట్జ్, రోనాల్డ్ రీగన్‌లను(ఫైటర్ విమానాలను తరలించగలిగిన యుద్ధ నౌకలు) అమెరికా దక్షిణ చైనా సముద్రం వైపుగా తరలించింది. 
 
చైనా నావికాదళం ఆ సముద్రంలో యుద్ధ విన్యాసాలు చేపడుతున్న సమయంలోనే అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ కారియర్‌లను అక్కడ మోహరించింది. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకే అమెరికా ఈ చర్య చేపట్టిందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ క్రమంలో చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఓ ట్వీట్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ కారియర్‌లను కూల్చేయగల డీఎఫ్-21డీ, డీఎఫ్-26 క్షిపణులు చైనా వద్ద ఉన్నాయని, దక్షిణ చైనా సముద్రంపై చైనాకు పూర్తి పట్టు ఉందని అమెరికాను హెచ్చరించే ప్రయత్నం చేసింది. 
 
దీనికి అగ్రరాజ్యం అమెరికా నేవికా దళం ధీటుగా సమాధానమిచ్చింది. 'అవునా.. అయినా కూడా అక్కడ రెండు అమెరికా యుద్ద నౌకలు ఉన్నాయి. మేం బెదిరేది లేదు' అంటూ తన ట్విట్టర్ ద్వారా చైనా తేరుకోలని పంచ్ ఇచ్చింది.
 
నిజానికి భారత్ - చైనా దేశాల మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. దీంతో భారత్‌కు అమెరికా, జపాన్ వంటి దేశాలు బాసటగా నిలిచాయి. ఈ క్రమంలోనే అమెరికా తన ఫైటర్ విమానాలు తరలించగల యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి తరలించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments