మయామి ఎయిర్‌పోర్టులో ఉద్యోగుల చేతివాటం

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (15:17 IST)
Security
విమానాశ్రయాలలో సెక్యూరిటీ చెకింగ్ పకడ్బందీగా జరుగుతుంది. అనుమానాస్పద వస్తువులను ఎయిర్ పోర్ట్ లోపలికి అనుమతించరు. అయితే, ఈ సెక్యూరిటీ చెకింగ్ దగ్గర విమానాశ్రయ సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించారు. 
 
ప్రయాణికుల బ్యాగులు, పర్సుల్లో నుంచి నగదుతో పాటు ఇతరత్రా విలువైన వస్తువులను కొట్టేశారు. అమెరికాలోని మయామి ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. ఉద్యోగుల చేతివాటం అక్కడున్న సీసీకెమెరాల్లో రికార్డు కావడంతో ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. 
 
సదరు ఉద్యోగులు ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఈ ఏడాది జూన్ 29న మయామి ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణీకులు తమ లగేజీని సెక్యూరిటీ స్కాన్ కోసం మెషిన్‌పై పెట్టగా.. అక్కడ విధుల్లో ఉద్యోగులు ఓ ప్రయాణికుడి లగేజీలో ఉన్న పర్సులో నుంచి 600 డాలర్లను గోంజాలెజ్, మరో ప్రయాణికుడి లగేజీలో నుంచి విలియమ్స్ నగదును కొట్టేశారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను పరిశీలించగా ఈ దొంగతనం బయటపడింది.
 
దీంతో గోంజాలెజ్, విలియమ్స్‌ను జులైలో పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా.. డ్యూటీలో ఉన్నప్పుడు ఇలా దొంగతనానికి పాల్పడుతున్నట్లు నిందితులు ఇద్దరూ అంగీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments