Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వియత్నాంలో అగ్ని ప్రమాదం : 56 మంది మృతి

Advertiesment
fire
, గురువారం, 14 సెప్టెంబరు 2023 (08:34 IST)
వియత్నాం దేశంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని హనోయ్‌లోని తొమ్మిది అంతస్తుల ఓ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 56 మంది మరణించారు. 54 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. 
 
భవనంలోని పార్కింగ్‌ ప్రదేశంలో మంగళవారం అర్థరాత్రి మొదలైన మంటలు ఆ తర్వాత పైఅంతస్తులకు వ్యాపించినట్లు స్థానికులు చెప్పారు. బుధవారం ఉదయానికి మంటలను అదుపు చేశారు. పోలీసులు 70 మందిని రక్షించి, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. 150 మంది నివసించే ఈ అపార్టుమెంటులో అత్యవసర ద్వారాలు లేవని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. 
 
చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సరికాదు : బండి సంజయ్ 
 
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడంపై తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండానే సీఎంగా పని చేసిన వ్యక్తిని అరెస్టు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. అరెస్టు తర్వాత ఏపీ ప్రజల్లో టీడీపీ పట్ల సానుభూతి పెరిగిందన్నారు. 
 
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా వైదొలగిన తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్.. చంద్రబాబు అరెస్టుపై ఒక సుధీర్ఘ ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వం ఆయనను అరె్టు చేసిన విధానం సరికాదన్నారు. సుధీర్ఘకాలంగా సీఎంగా పని చేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్టు చేయడం సమంజసం కాదని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అర్థరాత్రి అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీపై ఏపీ ప్రజల్లో సానుభూతి పెరిగిందన్నారు. అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు ఉంటే ఎవరిపైన అయినా చర్యలు తీసుకోవాల్సిందేనని, చట్టానిక అందరూ సమానమని కానీ, అరెస్టు తీరు మాత్రం ఏమాత్రం సరికాదన్నారు. 
 
కాగా, కేంద్రంలోని ఆ ఇద్దరు బీజేపీ నేతలకు తెలిసే చంద్రబాబు నాయుడిని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్మోన్ రెడ్డి అధికార పోలీస్ బలంతో అరెస్టు చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు చంద్రబాబు అరెస్టుపై ఒక్కరంటే ఒక్క బీజేపీ నేత కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఒక ఊపు తెచ్చిన మాజీ అధ్యక్షుడైన బండి సంజయ్ ఈ అరెస్టుపై స్పందించడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు రాజమండ్రికి పవన్ కళ్యాణ్ - చంద్రబాబు ములాఖత్