ఉత్తర కొరియా సాధారణంగా తమ దేశానికి ముప్పుగా భావించినప్పుడల్లా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుంది. ఇటీవలే అమెరికా అణు యుద్ధ నౌక దక్షిణ కొరియా జలాల్లోకి చేరుకుంది. దీంతో హెచ్చరికగా వరుస క్షిపణులను ప్రయోగించింది. ఈ స్థితిలో ఈ ఉదయం తూర్పు తీరంలో క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.
అణ్వాయుధాలను మోసుకెళ్లగల బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు జపాన్ ప్రధాని కార్యాలయం కూడా తెలిపింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రష్యాలో పర్యటిస్తున్నారు. పుతిన్‌తో భేటీ కానున్నారు. ఇరుదేశాల అధినేతల భేటీలో ఆయుధాల సరఫరాపై ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఉక్రెయిన్‌పై నిత్యం దాడులు చేస్తున్న రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు అందజేయడం ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ప్రపంచ నేతల దృష్టి మరల్చడంతో.. గతేడాది నుంచి ఉత్తర కొరియా దాదాపు 100 క్షిపణులను ప్రయోగించడం గమనార్హం.