Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో ఘోర బోటు ప్రమాదం- 192 మంది ప్రయాణీకులు?

ఇండోనేషియాలో ఘోర బోటు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 192 మంది ప్రయాణీకులు గల్లంతయ్యారు. బోటులో సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని అధికారులు చెప్తున్నారు. ఈ ఘటన లేక

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (16:15 IST)
ఇండోనేషియాలో ఘోర బోటు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 192 మంది ప్రయాణీకులు గల్లంతయ్యారు. బోటులో సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని అధికారులు చెప్తున్నారు. ఈ ఘటన లేక్ తోబాలో సంభవించింది. ఈద్ సంబరాల నేపథ్యంలో భారీ స్థాయిలో సరస్సుకు పర్యాటకులు వచ్చారు. ప్రస్తుతం సుమత్రా దీవుల్లో వాతావరణం ప్రతికూలంగా ఉంది. 
 
అయితే బోటులో ప్రయాణీకుల సంఖ్య అధికం కావడంతో బోటు ప్రమాదానికి గురైంది. ఇప్పటి వరకు కేవలం 18 మందిని మాత్రమే రక్షించారు. అయితే ఈ విషాదంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయం కూడా స్పష్టంగా తెలియదు. గజ ఈతగాళ్లు, అండర్‌వాటర్ డ్రోన్‌లు గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
లేక్ తోబా సుమారు 450 మీటర్ల లోతు వుంటుందని.. బోటు ఏ ప్రాంతంలో ముగిందనే విషయాన్ని ఇంకా నిర్ధారించలేదని గల్లంతైన వారి కోసం ముమ్మరంగా ఈతగాళ్లు సరస్సులో గాలిస్తున్నారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments