Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

54 యేళ్ల మహిళను మింగిన 7 మీటర్ల కొండచిలువ.. ఎక్కడ?

తమ కూరగాయల తోటలోకి వెళ్లిన 54 యేళ్ల మహిళను ఏడు మీటర్ల పొడవుండే కొండచిలువ ఒకటి మింగేసింది. ఈ ఘటన ఇండోనేషియాలోని మునా ఏజెన్సీ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

54 యేళ్ల మహిళను మింగిన 7 మీటర్ల కొండచిలువ.. ఎక్కడ?
, శనివారం, 16 జూన్ 2018 (17:29 IST)
తమ కూరగాయల తోటలోకి వెళ్లిన 54 యేళ్ల మహిళను ఏడు మీటర్ల పొడవుండే కొండచిలువ ఒకటి మింగేసింది. ఈ ఘటన ఇండోనేషియాలోని మునా ఏజెన్సీ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సెంట్రల్ ఇండోనేషియాలోని మునా ఏజెన్సీలో 54 యేళ్ల వా టిబా అనే మహిళ గురువారం సాయంత్రం తమ కూరగాయల తోటలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమె అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గాలించినా ఆమె అచూకీ తెలుసుకోలేక పోయారు. 
 
మరుసటిరోజు ఉదయం గ్రామస్థులంతా కలిసి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భారీ పైతాన్‌ (కొండచిలువ)ను కనుగొన్నారు. ఆ కొండ చిలువ కడుపు బాగా ఉబ్బి ఉండటంతో గ్రామస్థులంతా కలిసిదాన్ని పట్టుకుని కోయగా, దాని కడుపులో అదృష్యమైన మహిళ మృతదేహం కనిపించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో రొమాన్స్‌కు అడ్డొస్తున్నాడనీ భర్తను చంపి భార్య - సహకరించిన కుమారుడు