Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు బండిలో శృంగార శబ్దాలు... ప్రయాణికులు నవ్వులే నవ్వులు

Webdunia
గురువారం, 16 మే 2019 (21:00 IST)
సాధారణంగా రైల్లో వినిపించే ఆడియో సిస్టమ్ నుంచి తదుపరి స్టేషన్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇలా ఏవేవో శబ్దాలు వస్తుంటాయి. అయితే లండన్‌లోని ఓ రైల్లోని ఆడియో సిస్టమ్ నుంచి శృంగార శబ్దాలు రావడంతో ప్రయాణికులకు కొద్దిసేపు ఏమీ అర్థం కాకుండా, తికమకకు గురయ్యారు. 
 
రైలును నడుపుతున్న లోకో పైలట్ తన ఫోన్‌లో శృంగార వీడియోలను చూస్తూ ఆ ఆడియో కనెక్షన్‌ను పొరపాటున రైలు ఆడియో సిస్టమ్‌కు కనెక్ట్ చేసాడు, దీనితో ఈ శబ్దాలు రావడంతో ప్రయాణీకులు తికమకకు గురయ్యారు. రైలులో ఉన్న వారిలో ఓ ప్రయాణీకుడు ఈ శబ్దాన్ని రికార్డ్ చేసి ట్విటర్‌లో పోస్ట్ చేసాడు. దీనితో ఈ ఆడియో క్లిప్ ఒక్కసారిగా విపరీతమైన వైరల్ అయ్యింది. 
 
పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోపే వీడియోకు మిలియన్ వ్యూస్ దాటేశాయి. ట్విటర్‌లో వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి ఆ క్లిప్‌ను ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ లండన్‌ పేజీకి కూడా ట్యాగ్ చేశాడు. ఆ రైలు తమకు సంబంధించినది కాదంటూ ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు రీట్వీట్ చేశారు. కాగా, లండన్ చట్టాల ప్రకారం రైలు నడుపుతున్న లోకో పైలట్ ఫోన్‌ను పెట్టుకుని ఉండటం నిషేధం. వేలాది మంది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కావడంతో ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి కఠిన చర్యలు ఉంటాయని అధికారులు తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో

పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో దక్కన్ సర్కార్ మూవీ

జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారంటూ అభిమాని తల్లి వ్యాఖ్యలు

Sreeleela: బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందా? ఐటమ్ గర్ల్‌గా శ్రీలీల ఎంట్రీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం