Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగిని లెగ్గిన్ వేసిన భార్య.. పాములే అనుకుని చితకబాదిన భర్త... కాలు విరిగింది...

Advertiesment
నాగిని లెగ్గిన్ వేసిన భార్య.. పాములే అనుకుని చితకబాదిన భర్త... కాలు విరిగింది...
, ఆదివారం, 6 జనవరి 2019 (10:53 IST)
ప్రస్తుతం ఫ్యాషన్ వెర్రి తలలు వేస్తోంది. నాగిని పోలిన లెగ్గింన్స్ వేసిన భార్యను పాము అనుకుని చితకబాదాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, 
 
మెల్‍బోర్న్‌ నగరానికి చెందిన ఓ మహిళ దుస్తులు కొనేందుకు షాపింగ్ మాల్‌కు వెళ్లింది. అక్కడ పాము డిజైన్లతో  కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన లెగ్గిన్స్‌ను చూసి మనసుపారేసుకుంది. పైగా, చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండటంతో వాటిని కొనుగోలు చేసింది. 
 
ఆ తర్వాత రాత్రి నిద్రపోయే ముందు వాటిని ధరించింది. భర్తను ఆటపట్టించాలన్న వాటిని ధరించింది. అయితే, రాత్రి ఎందుకో ఆమె గదిలోకి వెళ్లిన భర్తకు బెడ్‌పై రెండు పాములు కదలాడుతున్నట్టు కనిపించింది. వీటిని తీక్షణంగా చూసిన భర్త.. అవి నిజంగానే పాములు అనుకుని భయపడ్డాడు. వెంటనే చప్పుడు చేయకుండా ఇంట్లో ఉన్న బేస్‌బాల్ బ్యాట్ అందుకుని బలంగా కొట్టాడు. బ్యాట్ దెబ్బకు ఆమె కెవ్వుమంటూ కేకలు వేసింది భార్య.  
 
అయితే, ఆమె కూడా పాములను చూసి భయపడిందనుకుని మరో దెబ్బ వేశాడు. ఈసారి బాధతో విలవిల్లాడుతూ.. అవి పాములు కావని, తన కాళ్లని చెప్పడంతో భర్తకు విషయం బోధపడింది. బ్యాట్ దెబ్బలకు తాళలేక కన్నీరు పెట్టుకున్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమె కాళ్లకు స్కాన్ చేసిన వైద్యులు ఎముకలు విరిగినట్టు తేల్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ మంత్రివర్గంలో ఆ ఇద్దరికీ నో బెర్త్