Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ బీచ్ రోడ్‌లో దాస‌రి, హరికృష్ణ విగ్ర‌హాల తొలగింపు

Webdunia
గురువారం, 16 మే 2019 (20:26 IST)
వైజాగ్ బీచ్ రోడ్‌లో గ‌ల దాస‌రి నారాయ‌ణ‌రావు, నంద‌మూరి హ‌రికృష్ణ‌ల విగ్ర‌హాల‌ను అర్థ‌రాత్రి గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ వారు తొలిగించారు. దీనిపై ఉత్త‌రాంధ్ర సినీ ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడు, ద‌ర్శ‌కుడు యాద‌కుమార్ మాట్లాడుతూ... వారి విగ్రహాలను తొలగించడం   అన్యాయ‌మ‌నీ, ఒక‌వేళ అనుమ‌తులు లేక‌పోతే విగ్ర‌హాలు నెల‌కొల్పి సుమారు ఆరు నెల‌ల కావొస్తోంది జివిఎమ్‌సి వారు ఏమి చేస్తున్నారనీ  అన్నారు.
 
సినీ రంగానికి వ‌న్నె తెచ్చిన ద‌ర్శ‌కుడు దాస‌రి గారి విగ్ర‌హం తొల‌గించ‌డం ద్వారా తెలుగు క‌ళా రంగాన్ని అవ‌మానించ‌డ‌మే అని సంఘం కార్య‌ద‌ర్శి, ద‌ర్శ‌కుడు కారెం విన‌య్ ప్ర‌కాష్ అన్నారు. నాట‌క రంగ ప్ర‌ముఖుడు, రంగ‌సాయి, నాట‌క సంఘం అధ్య‌క్షుడు `బాదంగీర్ `సాయి మాట్లాడుతూ...``అత్యంత చిన్న స్థాయి నుండి ఎంతో ఉన్న‌త స్థాయికి వ‌చ్చి, తెలుగు సినీ రంగంలో ఎంతో ఉన్న‌త‌మైన చిత్రాలు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దాస‌రి గారి విగ్ర‌హాన్ని`ఉత్త‌రాంధ్ర సినీ ద‌ర్శ‌కుల సంఘం``ఆధ్వ‌ర్యంలో అన్ని అనుమ‌తుల‌తో త్వ‌ర‌లో నెల‌కొల్పుతామ‌ని అన్నారు.
 
ఉత్త‌రాంధ్ర ద‌ర్శ‌కులు ర‌మేష్‌, శివశ్రీ, గీతాల‌య ప్ర‌సాద్, రాకేష్ రెడ్డి, లోలుగు రాజ‌శేఖ‌ర్‌ల‌తో పాటు ఉత్త‌రాంధ్ర‌కు చెందిన సినీ, టీవీ న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు పెద్ద సంఖ్య‌లో ధ‌ర్నాలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments