Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతో ఎలా పెట్టుకున్నా మీరే మునిగిపోతారు... ఇండియాకు చైనా వార్నింగ్?

చైనా మామూలుగా వార్నింగులు ఇవ్వడంలేదు. వార్నింగులు మీద వార్నింగులు ఇస్తోంది. సరిహద్దు సమస్య నేపధ్యంలో భారతదేశం, చైనా వస్తువులపై ఆంక్షలు విధిస్తుందనే ప్రచారం జరుగుతోంది. యుద్ధం చేయకుండా చైనా ఉత్పత్తులను భారతదేశంలో నిషేధిస్తే ఆ దేశానికి తీవ్ర నష్టం కలుగ

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (19:12 IST)
చైనా మామూలుగా వార్నింగులు ఇవ్వడంలేదు. వార్నింగులు మీద వార్నింగులు ఇస్తోంది. సరిహద్దు సమస్య నేపధ్యంలో భారతదేశం, చైనా వస్తువులపై ఆంక్షలు విధిస్తుందనే ప్రచారం జరుగుతోంది. యుద్ధం చేయకుండా చైనా ఉత్పత్తులను భారతదేశంలో నిషేధిస్తే ఆ దేశానికి తీవ్ర నష్టం కలుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చైనా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
చైనా ఉత్పత్తులను అడ్డుకుంటే నష్టపోయేది చైనా కాదు... భారతదేశమే అని తెలుపుతున్నాయి. చైనా ఉత్పత్తులను అడ్డుకుంటే భారతదేశంలో ఉపాధి అవకాశాలు భారీగా పడిపోతాయనీ, ఫలితంగా భారతదేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుందని పేర్కొంది. అంతేకాదు... భారతదేశంలో తయారవుతున్న వస్తువులతో చైనా వస్తువులను పోల్చి చూసినప్పుడు ధర, క్వాలిటీలో తేడా వుంటుందనీ, అందువల్ల ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటారని వెల్లడించింది. 
 
అన్నిటికీ మించి భారతదేశంలో ప్రస్తుతం చైనా పెడుతున్న పెట్టుబడులకు బ్రేక్ పడుతుందని, దీనివల్ల భారతదేశం తీవ్రంగా నష్టపోతుందని పేర్కొంది. కాబట్టి యుద్ధం చేసినా, చైనా వస్తువులపై నిషేధం విధించినా మునిగేది భారతదేశమే కాని తాము కాదంటూ బెదిరింపు మాటలు మట్లాడుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఏమిటో తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments