Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్రిక్తతల తగ్గింపే లక్ష్యంగా ఇండో - చైనా లెఫ్టినెంట్ జనరళ్ల భేటీ...

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (08:29 IST)
భారత భూభాగంలో ఇండో - చైనా దేశాలకు చెందిన సైన్యాల లెఫ్టినెంట్ జనరళ్ళ స్థాయి సమావేశం జరుగనుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించే లక్ష్యంగా ఈ చర్చలు జరుగనున్నాయి. 
 
ఈ సమావేశం తూర్పు లడఖ్‌లోని అధీనరేఖవెంబడి భారత భూభాగం వైపున ఉన్న చుసూల్‌లో ఇరు దేశ సైన్యాల లెఫ్టినెంట్ జనరళ్లు మంగళవారం సమావేశం కానున్నారు. బలగాల ఉపసంహరణతోపాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చడంపైనే ప్రధానంగా ఈ చర్చలు జరగనున్నాయి. 
 
అయితే, ఇందుకు సంబంధించిన విధివిధానాలు కూడా ఖరారు చేయనున్నారు. కాగా, ఇటీవల జరిగిన చర్చల ఫలితంగా చైనా సైన్యం గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, గల్వాన్ లోయ నుంచి వెనక్కి మళ్లింది. 
 
కాగా, గత నెల 15వ తేదీన గాల్వాన్ లోయలో చైనా బలగాలు హద్దుమీరి ప్రవర్తించి భారత బలగాలపై దాడి చేశాయి. ఈ దాడిలో 21 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 
 
కానీ, చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం సంభవించినప్పటికీ డ్రాగన్ కంట్రీ మాత్రం ప్రాణనష్టంపై పెదవి విప్పలేదు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో చైనా బలగాలు భారత భాభాగాన్ని వదిలి వెళ్లిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments