రామాయణంలో బంగారు లేడి గురించి మనం విన్నాం. ఆ బంగారు లేడి కావాలని సీతమ్మ అడగటం, శ్రీరాముడు దానికోసం అడవిలోకి వెళ్లడం తెలుసు. ఐతే పురాణాల్లో బంగారు లేడి గురించి తెలుసు కానీ ఇప్పుడు నిజంగానే మన దేశంలో ఓ బంగారు పులి.. గోల్డెన్ టైగర్ దర్శనమిచ్చి ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.
నిజానికి ఇలాంటి బంగారు పులులు చాలా అరుదుగా కనిపిస్తాయి. చెప్పాలంటే ఈ దశాబ్దంలోనే ఇలాంటి పులి వున్నట్లు గణాంకాల్లో స్పష్టమైంది. పులులు అంతరించిపోతున్న జాతి అని మనకు తెలుసు. ఈ జాతులను సంరక్షించడానికి భారతదేశం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు భారతదేశంలో గోల్డెన్ టైగర్ యొక్క నివాసం అంటే అంతా ఆశ్చర్యపోతున్నారు.
కాజీరంగ నేషనల్ పార్కులో గంభీరమైన గోల్డెన్ టైగర్‌ను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మయూరేష్ హెండ్రే తన కెమేరాలో బంధించారు. ఈ చిత్రాలను ఐఎఫ్ఎస్ పర్వీన్ కస్వాన్ పంచుకున్నారు. నిజానికి ఈ చిత్రాలు కొంతకాలం క్రితమే తీయబడ్డాయి కానీ ట్విట్టర్లో భాగస్వామ్యం చేయబడిన తరువాత అవి వైరల్ అవుతున్నాయి.