Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికా మహిళ శరీరంలో 32 రకాల మ్యుటేషన్స్‌

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (12:21 IST)
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ ఒక్కో దేశంలో ఒక్కో రూపంలో విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతూ కొత్త రూపును సంతరించుకుంటోంది.

ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలోని ఓ మహిళ శరీరంలో కరోనా వైరస్‌ తీవ్రంగా మారడాన్ని (మ్యుటేషన్స్‌ చెందడాన్ని) గుర్తించారు. 36ఏళ్ల ఆ మహిళ హెచ్‌ఐవీతో బాధపడుతుండగా, 216 రోజుల నుంచి కరోనా వైరస్‌తో పోరాడుతోంది.

కరోనా సోకిన రోజు నుంచి ఆమె శరీరంలో దాదాపు 30కిపైగా రకాలుగా కరోనా ఉత్పరివర్తనం చెందినట్లు పరిశోధకులు గుర్తించారు. మెడికల్‌ జర్నల్‌ మెడ్రిక్స్‌వి ఈ అసాధారణ కేసుకు సంబంధించిన వివరాలను ప్రచురించింది. అయితే, దీనిపై ఇప్పటివరకూ పునఃపరిశీలన జరపలేదు. సదరు మహిళ 2006లో హెచ్‌ఐవీ బారిన పడింది.

క్రమంగా రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తూ వచ్చింది. గతేడాది సెప్టెంబరులో కరోనా బారిన పడింది. అప్పటి నుంచి ఆమెలో కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ 13 రకాలుగా ఉత్పరివర్తనం చెందగా, జన్యుపరంగా 19 రకాలుగా రూపాంతరం చెందింది. E484K, B.1.1.7, N510Y, B.1.351 ఇలా ఆమె శరీరంలో పలు రకాలుగా కరోనా వైరస్‌ ఉత్పరివర్తనం చెందడాన్ని పరిశోధకులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో హెచ్‌ఐవీ బారిన పడిన వారు కరోనా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాదు, తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments