Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనా వైరస్‌కు భారతీయ బ్రహ్మాస్త్రం 2DG, ఇది మనిషి శరీరంలో వుంటే కరోనావైరస్ జీరో

Advertiesment
చైనా వైరస్‌కు భారతీయ బ్రహ్మాస్త్రం 2DG, ఇది మనిషి శరీరంలో వుంటే కరోనావైరస్ జీరో
, శనివారం, 15 మే 2021 (12:29 IST)
చైనా వైరస్‌కు భారతీయ బ్రహ్మాస్త్రం, భారతీయ రక్షణ సంస్థ DRDO తయారుచేసిన కరోనా మందు 2DG ఇవాళ విడుదల చేస్తోంది. మొదటి విడతగా 10000 డోసులు విడుదల అవుతున్నాయి. తొందరలోనే డాక్టర్ రెడ్డి లాబ్స్ సహకారంతో ఈ మందు మన హైదరాబాదులో బృహత్తర మోతాదులో తయారవబోతోంది. ఈ 2DG మందు 'మోసగాడిని మోసం చేయటం' అనే సూత్రంతో పని చేస్తుంది. 
 
ఏ వైరస్ అయినా మానవ శరీరంలోని కణాలతో కలిసి వాటినుంచి మోసం చేసి ప్రోటీన్ వాడుకుని పదింతలవుతుంది. ఇలా వైరస్ పెరగటానికి శరీరం నుంచి గ్లూకోస్ కణాల అవసరం వైరస్‌కు వుంటుంది. ఈ చక్కర అణువుల నుంచి వైరస్‌కి శక్తి వస్తుంది. ఆ శక్తితో మళ్ళీ పదింతలౌతుంది. ఇలా రక్తభీజునిలా పెరుగుతున్న కణాలతో మన రక్తంలోని తెల్లకణాలు పోరాటం చేస్తాయి. పెరిగే వైరస్ ఎక్కవై తెల్లకణాలు ఓడిపోయినప్పుడు మనిషి మరణిస్తాడు.
 
అయితే ఈ తాజా మందు, వైరస్‌ను మోసం చేసి గ్లూకోస్ అని భావించేలా చేస్తుంది. ఈ మందు అణువులను మింగిన వైరస్‌లు వంధ్యమై ఇంకా కొత్త వైరస్‌లను పుట్టించలేక పోతాయి. ఈ సమయంలో తెల్లకణాలు మిగిలిన వైరస్‌లను నాశనం చేస్తాయి. ప్రస్తుత అంచనా ప్రకారం కొన్ని గంటలలోనే కరోనా వైరస్ జీరో అవుతుంది.
 
ఈ మందు కనుక అనుకున్నవిధంగా పని చేస్తే, కరోనా వైరస్ చిన్న జలుబు కంటే చిన్న జబ్బుగా మారిపోతుంది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్సులో (మందు పరీక్షలో)ఇది అధ్బుతంగా పని చేసింది.
చైనా వాడి దుష్ట చేష్టలకు భారత రక్షణ శాస్త్రజ్ఞులు వాడినా బ్రహ్మాస్త్రమే ఈ మందు అంటున్నారు.... తెలిసిన డాక్టర్లు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణాజిల్లా ఆరోగ్య శ్రీ విభాగంలో క‌రోనా క‌ల్లోలం...