Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంజనేయుడి జన్మస్థలంపై తితిదే వర్సెస్ హనుమత్ జన్మక్షేత్ర ట్రస్ట్

ఆంజనేయుడి జన్మస్థలంపై తితిదే వర్సెస్ హనుమత్ జన్మక్షేత్ర ట్రస్ట్
, శుక్రవారం, 14 మే 2021 (17:46 IST)
టిటిడిని హనుమత్ జన్మక్షేత్ర ట్రస్ట్ నీడలా వెంటాడుతోంది. హనుమంతుడి బర్త్ ప్లేస్ పైన క్లారిటీ ఇవ్వాలంటూ మరో లెటర్ రాసింది. రెండురోజుల గడువు కూడా పెట్టింది. ఎన్ని రకాల పత్రాలు, రుజువులు చూపించినా ఆ సంస్థ సాధువులు మాత్రం సమాధానం పడట్లేదు. మరి ఇప్పుడు టిటిడి ఏం చేయబోతోంది. మళ్ళీ లెటర్ రాస్తుందా.. సవాల్‌కు స్పందిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారుతోంది.
 
వదల టిటిడి వదల అంటున్నాడు గోవిందానందసరస్వతి. లెటర్లతో టైం వేస్ట్ వద్దు.. నేరుగా రండి ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ యు ఆర్ రెడీ అంటూ టిటిడికి మరో లెటర్ రాశారు. టైం అవసరమే లేదని.. ఈ క్షణం రమ్మన్నా డిస్కషన్‌కు వస్తామని హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు. 
 
టిటిడి చేసిన పరిశోధనలపై నమ్మకం లేదంటున్నారు ఆ ట్రస్ట్ సభ్యులు. తప్పు ఒప్పుకుని తప్పుకోండని సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు ట్రస్ట్ సభ్యులు, స్వామి గోవిందానందసరస్వతి. దీనిపై టిటిడి ఈఓ గానీ, ఛైర్మన్ వెంటనే రియాక్ట్ అవ్వాలంటున్నారు. తిరుమల ఏడుకొండల్లో అంజనాద్రి ఆంజనేయుడి జన్మస్ధలంగా టిటిడి ప్రకటించింది.
 
బ్రహ్మాండ పురాణాన్ని హనుమంతుడి బర్త్ సర్టిఫికెట్‌గా చూపిస్తోంది. దీన్ని తప్పుబడుతున్న హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు హనుమంతుడు పుట్టిల్లు కర్ణాటకలోని పంపానది తీరంలో ఉన్న అంజనాద్రి అంటున్నారు. వెంకటాద్రిని అంజనాద్రిగా మార్చారంటూ మాదేనంటున్నారు ట్రస్ట్ సాధువులు. 
 
ఇప్పటికే వారు రెండు లెటర్లను టిటిడికి రాశారు. మొదటి లేఖపై టిటిడి రియాక్ట్ అయ్యింది. అస్సలు కిష్కిందికాండే హనుమంతుడు జన్మస్ధలం అనడానికి ఉన్న ఆధారాలేంటని ప్రశ్నించింది టిటిడి. దీనిపై నేరుగా స్పందించిన ట్రస్టు సభ్యులు మరో లెటర్ రాసి సవాల్‌కు సిద్ధమంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాడ్జికి రా అన్నాడు, సరే వచ్చేయ్ అంది, గది లోపలికెళ్లి దుప్పటి తీసి చూస్తే..