Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాడ్జికి రా అన్నాడు, సరే వచ్చేయ్ అంది, గది లోపలికెళ్లి దుప్పటి తీసి చూస్తే..

Advertiesment
young man
, శుక్రవారం, 14 మే 2021 (17:30 IST)
తన చెల్లెలితో అసభ్యంగా మాట్లాడిన మైనర్‌ బాలుడిపై అన్న, అతని స్నేహితులు లాడ్జ్‌కు పిలిపించి దాడి చేసి సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో జరిగింది.
 
బాధిత బాలుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మదనపల్లె టౌన్‌లో వుండే మైనర్ బాలుడు.. రామారావు కాలనీకి‌ చెందిన అమ్మాయితో అసభ్యంగా మాట్లాడుతూ లాడ్జికి రమ్మన్నాడు.
 
విషయాన్ని ఆ బాలిక తన సోదరుడికి తెలిపింది. దీనిపై అమ్మాయి సోదరుడు మరికొందరు కలిసి పక్కా ప్రణాళిక వేశారు. తన సోదరితో ఆ బాలుడికి లాడ్జికి రమ్మంటూ ఫోన్ చేయించారు. అలా పట్టణంలోని‌ ఓ లాడ్జ్ వద్దకు యువకుడిని రప్పించారు.
 
‌లాడ్జ్ రూముకు వెళ్లిన సదరు మైనర్ బాలుడు గదిలో దుప్పటి తీయగానే, దుప్పటి ముసుగు కప్పుకుని వున్న బాలిక సోదరి అతడిపై విరుచుకపడ్డాడు. అతడి స్నేహితులు కూడా దాడి చేయడం ప్రారంభించారు. బాలుడిపై విచక్షణ రహితంగా కాళ్ళుతో తన్నుతూ దాడి చేశారు. వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. 
 
దీనిపై బాధిత బాలుడు జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసారు. వీడియో ఆధారంగా టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుసగా నలుగురు ఆడపిల్లలు.. మగ పిల్లాడిని కనలేదని భార్యను కొట్టి చంపాడు..