Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరుసగా నలుగురు ఆడపిల్లలు.. మగ పిల్లాడిని కనలేదని భార్యను కొట్టి చంపాడు..

Advertiesment
వరుసగా నలుగురు ఆడపిల్లలు.. మగ పిల్లాడిని కనలేదని భార్యను కొట్టి చంపాడు..
, శుక్రవారం, 14 మే 2021 (17:28 IST)
మహిళలపై అకృత్యాలు రోజురోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు ఓ వైపు హత్యలు మరోవైపు జరుగుతున్నాయి. ఇవి చాలవన్నట్లు గృహ హింస కూడా ఆగట్లేదు. వరకట్నం వేధింపులు, ఆడ సంతానం పేరిట మహిళలపై వేధింపులు ఏమాత్రం ఆగట్లేదు. తాజాగా నలుగురు ఆడపిల్లల్ని కన్నదనే కారణంతో భార్యను ఓ భర్త కడతేర్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలో గురువారం జరిగిందీ సంఘటన. నలుగురు పిల్లల్లో చివరి చిన్నారికి మూడు నెలల వయసు మాత్రమే ఉంది. ఆడపిల్లల్ని కనడంతో పాటు తరుచూ కట్నం గురించి భార్యను వేధిస్తున్నాడు. హత్యకు ఇది కూడా కారణమేనని స్థానికులు అంటున్నారు.
 
మృతురాలి పేరు సావిత్రి బాఘేల్ (28), ఆమె భర్త (హంతకుడు) రతన్ సింగ్. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సావిత్రి బాఘెల్ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వారందరూ ఆడపిల్లలే. చివరి సారిగా మూడు నెలల క్రితం చిన్నారికి జన్మనిచ్చింది. అ
 
ప్పటి నుంచే రతన్ సింగ్ కోపంతో ఊగిపోతూ సావిత్రిని తరుచూ మాటల దాడి చేస్తూ వస్తున్నాడు. కాగా, గురువారం తన సోదరులతో కలిసి మగపిల్లాడిని ఎందుకు కనలేదంటూ తిడుతూ ఆమెను కొట్టి చంపాడు. నిందితుడి అరెస్ట్ చేసి భారత శిక్షాస్మృతి చట్టం సెక్షన్ 302, 304 (బి) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొమ్మిదేళ్ల క్రితం పెళ్లైనా పిల్లలు లేరు.. భార్య గర్భం దాల్చడంతో.. మామిడి తోటలో..?